ODI World Cup 2023 : పరువుపోయి పాకిస్తాన్ ఇంటికి.. కివీస్ సెమీస్ కు.. టీమిండియాతో టఫ్ ఫైట్…

నిజానికి ఒక్క అడుగు దూరంలో కప్పు అందుకోకుండా నిష్క్రమించడం అనేది ఇండియన్ టీం అభిమానుల్లో తీవ్ర నిరాశను కలిగించింది.

Written By: Gopi, Updated On : November 11, 2023 10:59 pm
Follow us on

ODI World Cup 2023 : వరల్డ్ కప్ లో సెమీఫైనల్ మ్యాచులు ఆడాలంటే ఇంతకు ముందు వరుసగా విజయాలను అందుకొని లీగ్ దశలో అత్యుత్తమమైన ప్రదర్శనను చూపిస్తూ వచ్చిన టీమ్ లకు మాత్రమే ఇక్కడ సెమీస్ ఆడే అవకాశం ఉంటుంది.అయితే ఇప్పటికే వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ ఆడాల్సిన అన్ని టీములు కరారై పోయాయి.మొదటి ప్లేస్ లో ఇండియా ఉంటే, సెకండ్ ప్లేస్ లో సౌతాఫ్రికా, థర్డ్ ప్లేస్ లో ఆస్ట్రేలియా, ఫోర్త్ ప్లేస్ లో న్యూజిలాండ్ టీంలు సెమీఫైనల్ కు చేరుకున్నాయి. ఇక సెమీస్ కి చేరడానికి భారీ అంచనాలు పెట్టుకున్న పాకిస్తాన్ టీమ్ సెమీ ఫైనల్ కి రాకుండానే ఇంటికి వెళ్లి పోవాల్సి వచ్చింది. నిజానికి పాకిస్తాన్ వరుసగా అన్ని మ్యాచ్ లు ఓడిపోతూ వచ్చింది. ఫేలవమైనా పర్ఫామెన్స్ ఇచ్చి చివర్లో ఒకటి రెండు మ్యాచ్ లు గెలిచినంత మాత్రన సెమీఫైనల్ కి వస్తారు అని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది.

ఇక దానికి తోడు పాకిస్తాన్ టీమ్ మీద ఇప్పటికే తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఏ టోర్నీకి ముందు అయిన వాళ్ళు ఎప్పుడైనా మేము తోపులం అని వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయిపోయే పాకిస్తాన్ టీం ఎప్పుడు బోల్తా పడుతూనే ఉంటుంది. ఇక కొంతమంది మాత్రం పాకిస్తాన్ టీం కి నోటి దూల ఎక్కువగా ఉంటుంది. ఆటలో టాలెంట్ చూపించలేరు కాబట్టే నోటికి వచ్చినట్టుగా వాగుతూ ఉంటారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మొత్తానికి పాకిస్తాన్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన సమయంలో న్యూజిలాండ్ టీం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సెమీస్ లోకి అడుగు పెట్టింది. నిజానికి న్యూజిలాండ్ ఫస్ట్ ప్లేస్ లో అయిన సెకండ్ ప్లేస్ లో అయిన ఉండి అన్ని టీములకంటే ముందుగా సెమీస్ చేరుతుందని అందరూ అనుకున్నారు.కానీ చివరగా ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయి న్యూజిలాండ్ చాలా కష్టాల్లో పడింది. ఇక చివరగా మొన్న శ్రీలంక మీద ఆడిన మ్యాచ్ లో భారీ విజయాన్ని అందుకోవడంతో న్యూజిలాండ్ టీమ్ సెమిస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.

ఈనెల 15వ తేదీన ముంబై వేదికగా మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అందులో ఇండియా న్యూజిలాండ్ టీంలు పోటీ పడుతున్నాయి…ఇక ఈ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం వేయి కనులతో ఎదురుచూస్తుంది. ఎందుకంటే 2019లో సేమ్ ఇదే పొజిషన్ లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడేటప్పుడు ఇండియన్ టీమ్ ని వర్షం భారీగా దెబ్బ కొట్టింది అనే చెప్పాలి. ఆ వర్షం వల్లే ఇండియా టీమ్ సెమీఫైనల్ లో ఓడిపోయింది. చివరి వరకు పోరాటం చేసి చివర్లో ఇండియన్ టీం ఓడిపోవడం చూసిన ప్రతి ఒక్క ఇండియన్ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కరాయనే చెప్పాలి.నిజానికి ఒక్క అడుగు దూరంలో కప్పు అందుకోకుండా నిష్క్రమించడం అనేది ఇండియన్ టీం అభిమానుల్లో తీవ్ర నిరాశను కలిగించింది.

ఇక ఇప్పుడూ రివెంజ్ తీర్చుకోవడానికి ఇండియన్ టీం మంచి ప్లాన్ తో ఇండియన్ టీమ్ బరిలోకి దిగుతుంది ఇప్పుడు ఇండియా ని ఓడించడం న్యూజిలాండ్ వల్ల కాదు కదా మరే టీం వల్ల కూడా అవ్వదు…ఇక ఈ టఫ్ ఫైట్ చూడటానికి 15 వ తేదీ కోసం ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని ఎదురు చూస్తున్నాడు…