
నెహ్రూ యువ కేంద్ర సంగథాన్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 13,306 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 20వ తేదీ దరఖాస్తుకు చివరి తేదీగా ఉంది. https://nyks.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ ద్వారా కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 2021 సంవత్సరం ఏప్రిల్ 1 నాటికి 18 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ అప్లికేషన్స్ గురించి అవగాహన, ఉన్నత విద్యార్హతలు, మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు మార్చి నెల 15వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి ఉద్యోగాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 5,000 రూపాయల వేతనం లభిస్తుంది. ఇంటర్వ్యూకు ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకొని వెళ్లాలి. https://nyks.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు కావడంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.