NTR Daughter Umamaheswari: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. దివంగత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న ఎన్టీఆర్ రామారావు కుటుంబంలో ఇలాంటి విషాదం జరగడం దురదృష్టకరం. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాత్తుగా మృతి చెందారు. అయితే, ఆమె మృతి షాకింగ్ విషయం తెలిసింది. కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని చనిపోయారని పోలీసులు అనుమానిస్తున్నారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నివసిస్తోన్న ఉమామహేశ్వరి.. చున్నీతో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె.. ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. అందుకే.. ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఉమామహేశ్వరి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Also Read: Aamir Khan: ప్లీజ్ నన్ను బహిష్కరించొద్దు.. స్టార్ హీరో కన్నీళ్లు.. ఇది నిజంగా షాకింగే
పోస్ట్‌మార్టం అనంతరం ఉమామహేశ్వరి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఉమామహేశ్వరికి భర్త శ్రీనివాస్ ప్రసాద్, ఇద్దరు కూతుళ్లు వున్నారు. ఉమామహేశ్వరి మరణ వార్త గురించి తెలిసి నందమూరి అభిమానులు బాధ పడుతూ నివాళులు అర్పిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సినీనటుడు బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు.

మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున కంఠమనేని ఉమామహేశ్వరి గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
Also Read:Naga Chaitanya- Samantha Divorce: సమంత చేసిన ఆ పనికే నాగచైతన్య విడాకులు తీసుకున్నాడా ?.. షాకింగ్ విషయాలు
Recommended Videos:
[…] […]