Nitish Kumar: అధికారం కోసం.. ఎంతకైనా దిగజానే రాజకీయ నేతగా దేశ చరిత్రలో నిలిచిపోయారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్.. రెండేళ్ల క్రితం వరకు ఎన్డీఏలో కొనసాగిన నితీశ్.. 2022లో ఎన్డీనుంచి బయటకు వచ్చారు. బద్ధ శత్రువు పార్టీ అయినా ఆర్జేడీ మద్దతులో మహాఘట్బంధన్ పేరుతో కూటమిగా ఏర్పడి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. ఆర్జేడీ నేత తేజశ్వియాదవ్‌ను ఉప ముఖ్యమంత్రిని చేశారు. రెండేళ్లు ఎలాంటి ఆటంకం లేకుండా పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా కూడా వ్యవహరించారు.
ప్రధాని పీటంపై కన్నేసి..
కేవలం ప్రధాని కావచ్చన్న ఆశతో నితీశ్ ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించారు. బీజేపీ ఏతర పార్టీలను ఇండియా కూటమిలో చేరేలా చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తానే ప్రనధాని అవుతానని కూడా భావించారు. కానీ, కూటమిలో ప్రధాని పీఠం ఆశించేవారిలో రాహుల్‌గాంధీతోపాటు మమతా బెనర్జీ, కేజ్రీవాల్, శరద్‌పవార్‌కూడా ఉన్నారు. మరోవైపు కూటమి ఏర్పడి ఏడాది దాటినా నితీశ్‌కు ఎలాంటి కీలక పదవి దక్కలేదు. మరోవైపు అయోధ్య రామమందిరం ప్రారంభంతో మోదీ ఇమేజ్ అమాంతం పెరిగింది. పరిస్థితిని గమనించిన నితీశ్..ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని డిసైడ్ అయ్యారు. మరోవైపు మమతాబెనర్జీ, కేజ్రీవాల్ కూటమి నుంచి బయటకు వచ్చారు.
మహాఘట్బంధన్కు గుడ్‌బై..
ఇండియా కూటమి బలహీన పడుతున్న తరుణంలో అందులో ఉన్నా ప్రయోజనం ఉండదని భావించిన నితీశ్‌కుమార్ ముందుగా బిహార్‌లోని మహాఘట్బంధన్కు గుడ్‌బై చెప్పారు. అంతకుముందే ఎన్డీఏతో టచ్‌లోకి వెళ్లారు. బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు. బీజేపీ సానుకూలంగా స్పందించడంతో బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ ఆదివారం(జనవరి 28న) రాజీనామా చేశారు. రెండు రోజుల సస్పెన్స్‌కు తెర దించారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. మహాఘట్బంధన్కు తెగదెంపులు చేసుకుంటున్నట్లు తెలిపారు.
బీజేపీ మద్దతుతో మళ్లీ..
బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు నితీశ్ ప్రకటించారు. ఇప్పటికే పార్టీ నేతలతో సమావేశమైన నితీశ్ వారికి విషయం చెప్పారు. ఎమ్మెల్యేలు, నాయకులు మద్దతు తెలుపడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. మరోవైపు బీజేపీతో మంతనాలు కూడా పూర్తయ్యాయి. మరికాసేపట్లో ఎన్డీఏ కూటమిలో అధికారికంగా చేరబోతున్నారు. ఆ తర్వాత శాసన సభా పక్ష నేతగా ఎన్నికై 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది.
బలాబలాలు ఇలా..
బిహార్‌లో మొత్తం 242 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఆర్జేడీకి అత్యధికంగా 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 122 మంది బలం కావాలి. బీజేపీకి 78 మంది సభ్యులు ఉన్నారు. లెక్కల వారీగా చూస్తే ఆర్జేడీ – 79, బీజేపీ – 78, జేడీయూ – 45, కాంగ్రెస్ – 19, సీపీఐ(ఎంఎల్) – 12 మంది ఉన్నారు. నీతీశ్‌కుమార్ మహాఘట్బంధన్ నుంచి బయటకు వస్తే జేడీయూకు ఉన్న 45 మందికి బీజేపీలోని 78 మంది తోడవుతారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ వస్తుంది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఆర్జేడీ లేదా బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది.
వరుసగా 15 ఏళ్లుగా అధికారంలో ఉంటున్న నితీశ్‌కుమార్ అధికారం కోసం ఒకసారి బీజేపీ, మరోసారి కాంగ్రెస్, మళ్లీ బీజేపీ వైపు మారిపోయారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్న నితీశ్‌ను ఎన్నికల్లో బిహార్ ప్రజలు ఎలా చూస్తారో చూడాలి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Nitish kumar resigned from the post of cm of bihar governor arlekar immediately approved
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com