Karthikeya 2 Box Office Collections: అబద్దపు కలెక్షన్ల మాయాజాలంలో పూర్తిగా ఫేక్ పబ్లిసిటీతోనే బ్రతికే సినిమా స్టార్లు ఉన్న ఇండస్ట్రీలో నిజాయితీతో హిట్ కొట్టాడు నిఖిల్. కార్తికేయ 2తో సూపర్ హిట్ కొట్టాక కూడా మీడియా మాయలో కొట్టుకుపోవాలనుకోలేదు. సక్సెస్ అందుకున్న హీరోనే అయినప్పటికీ.. నిర్మాతల అడ్వాన్స్ లకు తలొగ్గలేదు. పైగా ‘కార్తికేయ 2’ హిట్ కి కారణం తన గొప్పతనం కాదు, సినిమా కథకు ఉన్న కెపాసిటీ అది అని సగర్వంగా చెప్పాడు. గ్రాఫిక్స్ స్వర్గంలో తేలియాడకుండా నిజాయితీగా నేల మీదే ఉన్నాడు. అన్నిటికీ మించి తన సినిమా కలెక్షన్స్ విషయంలో ఎంతో నిఖ్ఖచ్చిగా ఉన్నాడు. అసలు ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన కార్తికేయ 2, అన్ని కోట్లు ఎలా కలెక్ట్ చేసింది ?, ఇదే ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా వైరల్ అవుతున్న షాకింగ్ విషయం. సినిమా రిలీజ్ అయి నేటికీ 18 రోజులు అవుతుంది. విచిత్రంగా 18వ రోజు కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ స్టడీ గా ఉండటం విశేషం. సినిమా లైఫ్ వారం రోజులకు పడిపోయిన కాలంలో కూడా.. రోజులు గడిచే కొద్దీ.. రోజురోజుకు తన లైఫ్ స్పాన్ పెంచుకుంటూ పోతుంది ‘కార్తికేయ 2’.

ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వరకూ బాక్సాఫీస్ దగ్గర షేకింగ్ కలెక్షన్స్ ను రాబడుతోంది. మొత్తానికి పాన్ ఇండియాని నిఖిల్ షేక్ చేస్తున్నాడు. ‘చందు మొండేటి’ డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఒక సంచలనం. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ గా వచ్చిన కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇలా సందడి చేయడం సినీ ప్రముఖులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినిమాలో నిఖిల్ చేసిన విన్యాసాలు.. అలాగే బెస్ట్ విజువల్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.
మరీ బాక్సాఫీస్ వద్ద ‘కార్తికేయ 2’ సక్సెస్ ఏ స్థాయిలో ఉంది ?, 18 రోజుల కలెక్షన్స్ తో నిర్మాతకు ఏ రేంజ్ లో లాభాలు వచ్చాయో ? చూద్దాం రండి.
ముందుగా ఏరియాల వారీగా ఈ చిత్రానికి కలెక్షన్స్ ఎలా వచ్చాయి అంటే ?
నైజాం 11.99 కోట్లు
సీడెడ్ 4.74 కోట్లు
ఉత్తరాంధ్ర 4.33 కోట్లు
ఈస్ట్ 2.45 కోట్లు
వెస్ట్ 1.63 కోట్లు
గుంటూరు 2.76 కోట్లు
కృష్ణా 2.08 కోట్లు
నెల్లూరు 1.05 కోట్లు
మొత్తానికి ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 18 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘కార్తికేయ 2’ రూ. 31.53 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 63.05 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.68 కోట్లు
ఓవర్సీస్ 5.70 కోట్లు
హిందీ మరియు ఇతర వెర్షన్లు 11.98 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 18 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘కార్తికేయ 2’ రూ. 51.99 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 103:98 కోట్లను కొల్లగొట్టింది

‘కార్తికేయ 2’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.17.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ రూ. 51.99 కోట్లు షేర్, రూ. 103:98 కోట్ల గ్రాస్. ఈ అంకెలు చాలు, ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో చెప్పడానికి. పైగా ఒక తెలుగు యంగ్ హీరో సినిమా ప్రవాహంలో బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కొట్టుకుపోవడం అంటే.. ఎన్నడూ ఊహించని విషయమే. లాభాల పరంగా చూసుకుంటే.. అమిర్ లాల్ సింగ్ చడ్డా కంటే డబుల్, అక్షయ్ రక్షాబంధన్ కంటే త్రిబుల్ హిట్ ను ఈ సినిమా సాధించింది. ఇది బాలీవుడ్ కే షాకింగ్. ఇక టాలీవుడ్ లో కూడా ‘కార్తికేయ 2’ చాలా షాక్ లు ఇచ్చింది. ‘కార్తికేయ 2’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కంటే.. రవితేజ రామారావు క్లోజింగ్ కలెక్షన్స్ తక్కువ. ఆచార్య లాంగ్ రన్ కలెక్షన్స్ కంటే.. ‘కార్తికేయ 2’ 18 రోజుల కలెక్షన్స్ ఎక్కువ. అసలు మెగాస్టార్ ఆచార్య సినిమా కలెక్షన్స్ ను ఒక చిన్న హీరో సినిమా రాబడట్టం నిజంగా గ్రేటే. అందుకే.. శభాష్ నిఖిల్ రియల్లీ యువర్ గ్రేట్.
Also Read:Pawan kalyan- Bandla Ganesh: పవన్ ఫ్యాన్స్ కి భక్తుడు బండ్ల గణేష్ విన్నపం… ఆలకించి ఆదరిస్తారా?


[…] Also Read: Karthikeya 2 Box Office Collections: చిన్న హీరో దెబ్బకు కొట్… […]