Samantha: విడాకులు తీసుకున్నప్పటి నుండి సమంత పర్సనల్ మేటర్స్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. తాజాగా ఆమె గురించి సంచలన న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. తల్లి పోరు పడలేక సమంత ఏకంగా గర్భం తొలగించుకున్నారట. 35 ఏళ్ల సమంతను రెండో పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లిగారు ఇబ్బంది పెడుతున్నారట. జీవితానికి తోడు అవసరం, వయసైపోతుంది పెళ్లి చేసుకోమని ఆమె గోల చేస్తున్నారట. సమంతకు మాత్రం రెండో పెళ్లి ఆలోచన లేదట. గత అనుభవాలరీత్యా ఇకపై లాంగ్ రిలేషన్స్ పెట్టుకోకూడదని అనుకుంటున్నారట. జీవితంలో ఇక పెళ్లి చేసుకోకూదని గట్టి నిర్ణయం తీసుకున్నారట.

ఈ క్రమంలో అమ్మ నుండి పెళ్లి ఒత్తిడి తప్పు కోవాలంటే గర్భం తొలగించుకోవడమే సరైన మార్గమని ఆ పని చేశారట. అందుకే నెల రోజులుగా సమంత సోషల్ మీడియాకు, ప్రపంచానికి దూరంగా ఉన్నారనేది తాజా వార్త. మరి ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. జీవితంలో ప్రతి ఒక్కరు తల్లి కావాలని అనుకుంటారు. మాతృత్వపు అనుభూతి ఆస్వాదించాలని ఆరాటపడతారు. అలాంటిది సమంత గర్భం తొలగించుకోవడమేంటని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.
కాగా నాగ చైతన్యతో సమంత విడిపోవడానికి కారణాల్లో ఇది కూడా వినిపించింది. సమంత పిల్లలు కనడానికి ఇష్టపడటం లేదని, చైతు ఆమెకు పలుమార్లు చెప్పి విసిగిపోయాడని, అందుకే విడాకులు ఇచ్చాడంటూ ఒక వాదన తెరపైకి వచ్చింది. ఇన్ని నెలల తర్వాత మరలా సమంత గర్భం తొలగించుకున్నారంటూ వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఐదు వారాలుగా సమంత సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా చేయలేదు.

మరోవైపు హిందీ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం సన్నద్ధమవుతున్న సమంత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారని అందుకే సోషల్ మీడియాకు దూరమయ్యారు అంటున్నారు. కెరీర్ పరంగా సమంత చాలా బిజీగా ఉన్నారు. తెలుగులో సమంత శాకుంతలం, యశోద, ఖుషి చిత్రాలు చేస్తున్నారు. ఈ మూడు పాన్ ఇండియా చిత్రాలుగా విడుదలయ్యే సూచనలు కలవు. శాకుంతలం, యశోద చిత్రాలను ఇప్పటికే ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. హిందీలో ఒకటి రెండు చిత్రాలు ప్రకటించిన సమంత రెండు వెబ్ సిరీస్లకు సైన్ చేసినట్లు సమాచారం.
[…] […]