New Year Celebrations: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో చాలా మంది ప్రస్తుతం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని వాళ్ళ ఇష్టమైన దేశాలలో సెలబ్రేట్ చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తూన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు అందరూ వివిధ దేశాలలోకి వెళ్లి అక్కడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే మహేష్ బాబు ఇప్పటికే ఫ్యామిలీ తో కలిసి దుబాయ్ వెళ్ళాడు. అక్కడ ఆడ్ ఫిలిమ్ షూట్ లో పాల్గొని అందులో భాగంగానే దుబాయ్ లోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని కూడా తన ఫ్యామిలీతో పాటు జరుపుకోవాలని ఇప్పటికే ఫ్యామిలీతో మహేష్ బాబు దుబాయ్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది…
ఇక ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ టైంలో జపాన్ వెళ్ళాడు అక్కడ షూటింగ్ లో పాల్గొన్న ఎన్టీఆర్ అక్కడ వాతావరణం లొకేషన్స్ బాగా నచ్చాయి ఇక దాంతో ఆయన ఈ సంవత్సరం కూడా న్యూ ఇయర్ వేడుకలను జపాన్ లో సెలబ్రేట్ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో కూడా ఇప్పటికే దుబాయ్ లోని అత్యంత ఎత్తైన హోటల్ లో కొన్ని రూమ్స్ బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. గత సంవత్సరం కూడా తను అక్కడే న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకున్నాడు. ఇక ఈ సంవత్సరం కూడా అక్కడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో ఇప్పటికే ఒక సినిమా షూటింగ్ కోసం అమెరికా కి వెళ్లాడు.ఇక అందులో భాగంగానే ఆయన న్యూ ఇయర్ వేడుకలను అమెరికాలోనే చాలా గ్రాండ్ గా చేసుకోబోతున్నట్టు గా తెలుస్తుంది.
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే రష్మిక మందన, పూజ హెగ్డే, శృతిహాసన్ లాంటి స్టార్ హీరోయిన్స్ సైతం విదేశాలలోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నట్లుగా తెలుస్తుంది… మన స్టార్ హీరోలు హీరోయిన్లు అందరూ న్యూ ఇయర్ కోసం వివిధ దేశాలలో సెలబ్రేషన్స్ ని జరుపుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి…
నిజానికి ఇంతకుముందు మన హీరోలందరూ కూడా ఇండియాలోనే న్యూ ఇయర్ వేడుకలను జరుపుకునేవారు మరి ముఖ్యంగా హైదరాబాద్ లోనే చాలా ఎక్కువగా జరుపుకునే వారు కానీ కాలక్రమమైన హీరోల ఇమేజ్ అనేది పెరగడం అలాగే వాళ్ళు సినిమా సినిమాకి మధ్య రిలాక్సేషన్ ని కోరుకోవడం లాంటి వాటి వల్ల అలాగే ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేసినట్టుగా అవుతుందనే ఉద్దేశ్యం తోనే న్యూ ఇయర్ టైం లో ఫ్యామిలీ ట్రిప్పులను ప్లాన్ చేస్తూ వాళ్లకు నచ్చిన దేశాలు తిరుగుతూ అక్కడే న్యూ ఇయర్ వేడుకల్ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తున్నారు…