CM Revanth Reddy: తెలంగాణ మూడో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణం చేశారు. ఎల్బీ స్టేడియం వేదికగా, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో రేవంత్‌రెడ్డితో తెలంగాణ గవర్నర్ రేవంత్‌రెడ్డితో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ శ్రేణుల హర్షధ్వానాల మధ్య రేవంత్ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్ కు గర్నర్ తమిళిసై పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు.
అంతకుముంద..
ప్రమాణ స్వీకారానికి ముందు రేవంత్‌రెడ్డి టాప్‌లెస్ జీపులో సోనియాగాంధీతో కలిసి ఎల్బీ స్టేడియంలోని ప్రమాణ స్వీకర వేదిక వద్దకు చేరుకున్నారు. వేదికపైకి వచ్చిన సోనియాగాంధీ కుర్చీలో ఆసీనులయ్యే వరకు రేవంత్ ఆమె వెంటే ఉన్నారు. తర్వాత గవర్నర్‌కు స్వాగతం పలకడానికి వెళ్లారు. ఆమెను కూడా సాదరంగా స్వాగతిస్తూ వేదికపైకి తీసుకువచ్చారు.
ముఖ్యమంత్రి, 11 మంది మంత్రుల ప్రమాణం..
అనంతరం గవర్నర్ తమిళిసై సీఎంగా రేవంత్‌రెడ్డితో, 11 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. రేవంత్ మొదట పమాణం చేయగా, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క తర్వాత ప్రమాణం చేశారు. అందరూ దైవసాక్షిగా ప్రమాణం చేయగా, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క మాత్రం మనస్సాక్షిగా ప్రమాణం చేశారు. అందరూ తెలుగులో ప్రమాణం చేయగా దామోదర రాజనర్సింహ ఇంగ్లిష్‌లో ప్రమాణం చేశారు.
సోనియాకు పాదాభి వందనం..
1:21 గంటల నుంచి 1:50 వరకు ప్రమాణస్వీకార కార్యక్రమం సాదింది. ఈ సందర్భంగా మంత్రులుగా ప్రమాణం చేసిన సీతక్క, జూపల్లి కృష్ణారావులు అనంతరం సోనియాగాంధీకి పాదాభివందనం చేశారు. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత, గవర్నర్ వెళ్లిపోయిన అనంతరం రేవంత్‌రెడ్డి కూడా సతీసీమేతంగా సోనియాగాంధీ వద్దకు వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి అయినా.. తన గురువు అయిన సోనియాగాంధీకి పాదాభివందనం చేసి తన సింప్లిసిటీని చాటుకున్నారు. తర్వాత తన కుటుంబ సభ్యులను సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు పరిచయం చేశారు.
#WATCH | New CM of Telangana Revanth Reddy and his family meet Congress Parliamentary Party Chairperson Sonia Gandhi, MP Rahul Gandhi and General Secretary Priyanka Gandhi Vadra after the swearing-in ceremony in Hyderabad. pic.twitter.com/h9SqUbHXZN
— ANI (@ANI) December 7, 2023