Salaar On Pawan Kalyan: సలార్ బ్లాక్ బస్టర్ ఎఫెక్ట్ తెలుగు రాజకీయాలపైనా పడినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్‌తో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. బాహుబలి తర్వాత వరుస డిజాస్టర్స్ ఎదరైనా.. ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందరి ఆకలి తీర్చేందుకు సలార్ మూవీతో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఎక్కడ చూసిన సలార్ మేనియా కనిపిస్తోంది. ఇదే సమయంలో నెటిజన్లు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు. సీఎం పదవి షేరింగ్‌పై లోకేష్ కామెంట్స్ ఆధారంగా ట్రోల్ చేస్తున్నారు.
యోధుడిగా ప్రభాస్..
ఈ మూవీలో ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని ఎలా ఉపయోగించుకున్నాడనేది సోషల్ మీడియా వేదికగా ఆసక్తి కర చర్చ సాగుతోంది. యాక్షన్ సీన్స్‌లో ప్రభాస్ బాడీ, ఊరమాస్ లుక్ డైరెక్టర్ అద్భుతంగా ఎలివేట్ చేశారని ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ మూవీలో ప్రతీ సీన్‌లో ప్రభాస్‌ను ఒక వీర యోధుడిగా చూపించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కి ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు ఫిదా అవుతున్నారు.
పాత్రలో ఒదిగిపోయేలా..
బాహుబలిలో ఒక మహరాజు ఎలా ఉంటాడో దానికి తగ్గట్టుగా చూపించారు రాజమౌళి.. యుద్ధ రంగంలో ఒక వీరుడు ఎలా ఉంటాడో చూపించాడు ప్రశాంత్ నీల్ అంటూ చర్చ సాగుతోంది. ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. అందులో భాగంగా సోషల్ మీడియా ఒక పోస్టింగ్ వైరల్ అవుతోంది. ప్రభాస్ కటౌట్‌కి తగ్గట్టుగా వాడుకుంది రాజమౌళి, ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌ని బాగా వాడుకుంది వీవీ.వినాయక్, రాజమౌళి. అల్లు అర్జున్‌ని సూపర్ గా వాడుకుంది త్రివిక్రమ్, సుకుమార్. ప్రిన్స్ మహేష్‌బాబుని బాగా వాడుకుంది పూరి జగన్నాథ్. ఇక పవన్ కళ్యాణ్‌ను ఒక రేంజ్ లో వాడుకుంది కేవలం మాజీ సీఎం చంద్రబాబు అంటూ ఎక్స్‌లో చేసిన పోస్ట్ సర్క్యులేట్ అవుతోంది. పవన్ కళ్యాణ్‌ని ఉపయోగించుకోవడంలో చంద్రబాబుతో ఏ డైరెక్టర్ పోటీ పడలేరని డైరెక్టర్ ఆర్జీవీ చెప్పుకొచ్చారు.
పవన్‌పై కామెంట్స్..
తాజాగా టీడీపీ నేత నారా లోకేశ్ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పవన్‌కు సీఎం పదవి ఇచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. అసలు అలాంటి ప్రతిపాదనే లేదని..పవన్ సైతం చంద్రబాబు సీఎంగా ఉంటారని ఇప్పటికే స్పష్టం చేశారని చెప్పుకొచ్చారు. లోకేష్ చేసిన కామెంట్స్‌తో నెటిజెన్లు పవన్ తన అభిమానుల కోరిక కాదని.. చంద్రబాబు కోసం పని చేస్తున్నారని కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. లోకేష్ వ్యాఖ్యలపై పవన్‌కు బలమైన మద్దతుదారుగా ఉన్న చేగొండి హరిరామజోగయ్య లాంటి వారు సైతం స్పందించారు. జనసేన మాత్రం అధికారికంగా రియాక్ట్ కాలేదు. కానీ, పవన్‌ను వాడుకుంది చంద్రబాబు అంటూ భారీ ఎత్తున పోస్టింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.