Nayanathara Vignesh wedding: సినీ తారల పెళ్లిళ్లు కనువిందుగా ఉంటాయి. నాడు సమంత-నాగచైతన్యది అయినా..నేడు నయనతార-విఘ్నేష్ ది అయినా కన్నుల పండువగా సాగుతూనే ఉంటాయి. వీరి బంధాలు బలంగా ఉండకున్నా కానీ ఆర్భాటాలు మాత్రం అదిరిపోయేలా ఉంటాయి. తెలుగుసహా దక్షిణాదిలో ఇప్పుడు నయనతార-విఘ్నేష్ ల పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కలిసి తిరిగారు. విదేశాల్లో ఎంజాయ్ చేశారు.ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

లేడీ సూపర్ స్టార్ నయనతార, ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ల పెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో ఎంతో వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవిప్పుడు వైరల్ గా మారాయి.

తమిళనాడులోని మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్ హోటల్ లో పెళ్లి వేడుక అదిరిపోయేలా జరిగింది. నయన్ పెళ్లికి తమిళనాడు కు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రజినీకాంత్, సూర్య, అజిత్ తోపాటు బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్, బోనీకపూర్, అట్లీ కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

హోటల్ లోకి బయట వారిని రాకుండా క్యూఆర్ కోడ్ సిస్టం పెట్టి అతిథులకు వారిని అందజేశారు. చివరకు అతిథులకు ఇచ్చే వాటర్ బాటిళ్లు, కర్చీఫ్ లకు కూడా నయన్-విఘ్నేష్ ఫొటోలు ప్రింట్ చేశారు. నయనతార అన్నీ దగ్గరుండి ఈ పెళ్లి ఏర్పాట్లు చేశారు. ప్రతీదాంట్లోనూ ఆమె ముద్ర వేశారు. ఇక విఘ్నేష్ శివన్ తనకు కాబోయే భార్య నయనతార కోసం 5 కోట్లు వెచ్చి బంగారం, ఉంగరాలు ఇతర పెళ్లి వస్తువులు స్వయంగా కొనుగోలు చేశాడు. ఇక నయనతార ధరించే గద్వాల్ చీర ధర కూడా రూ.5 లక్షల వరకూ ఉంటుందని సమాచారం. బంగారు దారాలతో చేసిన ఈ చీరను నయనతార పెళ్లిలో ధరించింది.

గౌతమ్ మీనన్ కు చెందిన కంపెనీ, అతడి టెక్నికల్ యూనిట్ ఈ పెళ్లి వేడుకను వీడియో, ఫొటోగ్రపీ బాధ్యత తీసుకుంది. వీరి పెళ్లి వీడియోను నెట్ ఫ్లిక్స్ లో రెండు పార్టులుగా ప్రసారం కానుంది. పెళ్లి వీడియోను రూ.2.5 కోట్లకు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. విఘ్నేష్ , నయనతార లైఫ్ స్టోరీని ఇందులో టెలికాస్ట్ చేస్తారు.

నయన్-విఘ్నేష్ దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమలో మునిగి చివరకు పెళ్లితో వీరు ఒక్కటయ్యారు.
Recommended Videos

[…] Also Read: Nayanathara wedding: వైరల్ గా నయనతార-విఘ్నేష్ శివన… […]
[…] Also Read: Nayanathara wedding: వైరల్ గా నయనతార-విఘ్నేష్ శివన… […]