Nayantara Valuable Gift To Her Husband: సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార మొత్తానికి ఈరోజు ఒక్క ఇంటి ఆమె అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ తో చాలా కాలం నుండి ప్రేమలో ఉన్న నయనతార మొత్తానికి పెళ్లి అయితే చేసుకోబోతుంది..ఈ పెళ్లి కి కోలీవుడ్ మరియు టాలీవుడ్ కి సంబంధించిన నటీనటులు హాజరు కాబోతున్నట్టు సమాచారం..వీళ్లిద్దరి వెడ్డింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది..ఇక ఈ పెళ్లి విశేషాలు గురించి కాసేపు పక్కన పెడితే..నయనతార తన కాబొయ్యే భర్త కోసం ఇచ్చిన ఒక్క విలువైన బహుమతి గురించి సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది..అదేమిటి అంటే నయనతార 20 కోట్ల రూపాయిలు విలువ చేసే ఇంటిని తన భర్త విగ్నేష్ పేరు మీద రాసి ఇచ్చింది అట..అత్యాధునిక టెక్నాలజీతో నయనతార కట్టించిన ఈ ఇంట్లోనే ఈ ఇద్దరు దంపతులు కాపురం చెయ్యబోతున్నట్టు సమాచారం.

Also Read: Naga Chaitanya: ఇష్టం లేకపోయినా నాగ చైతన్య తో బలవంతంగా సంతకాలు పెట్టించిన సమంత
ఇక విగ్నేష్ కూడా నయనతార కోసం విలువైన నగలను ప్రత్యేకంగా తయారు చేయించి ఇచ్చాడట..ఇలా పెళ్ళికి ముందే ఒక్కరిఒక్కరు విలువైన బహుమతులు ఇచ్చుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..చాలా కాలం నుండి డేటింగ్ లో ఉన్న ఈ ఇద్దరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు..?? అసలు చేసుకుంటారా లేదా అనే వార్తలు సోషల్ మీడియా లో తరుచు ప్రచార అవుతూ ఉండేవి..ఎందుకంటే నయనతార గతం లో కోలీవుడ్ స్టార్ హీరో శింబు తో ప్రేమాయణం నడిపింది..అంతా సజావుగా సాగుతూ రేపో మాపో పెళ్లి అని అనుకుంటున్న సమయం లో ఈ ఇద్దరికీ బ్రేయాకప్ అవ్వడం అప్పట్లో ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది..ఇక ఆ తర్వాత నయనతార -ప్రభుదేవా పెళ్లి కూడా పీటలు వరుకు వచ్చి ఆగిపోయింది..ఇలా రెండు సార్లు నయనతార కి జరగడం తో విగ్నేష్ తో కూడా అలాగే ఉంటుంది ఏమో అని అందరు అనుకున్నారు..కానీ మొత్తానికి ఈ ఇద్దరు ఈరోజు అతిరధ మహారధుల సమక్షం లో పెళ్లి చేసుకోబోతుండడం తో అభిమానులు ఎంతో సంతోషాన్ని సోషల్ మీడియా లో వ్యక్తపరుస్తున్నారు..ఇక పెళ్లి తర్వాత నయనతార సినిమాలు చేస్తుందా లేదా అనే సందేహం నిన్న మొన్నటి వరుకు అభిమానుల్లో ఉండేది..కానీ పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలు కొనసాగిస్తుంది అని నయనతార సన్నిహిత వర్గాల నుండి అందుతున్న వార్త..ఇటీవలే ఆమె తన భర్త విగ్నేష్ దర్శకత్వం లో విజయ్ సేతుపతి మరియు సమంతలతో కలిసి కన్మణి రాంబో కతిజా అనే సినిమా చేసింది..ఇటీవలే విడుదల అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Also Read: Cordelia Cruise Ship: విశాఖలో.. విహార నౌక.. క్రేజీ క్రూయిజ్ వచ్చింది!!