Nara Lokesh : నారా లోకేష్ ఢిల్లీకి పారిపోయి టీడీపీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాడు

క్యాడర్ మధ్య ఉండి బూస్ట్ ఇవ్వాల్సిన నేతలు పారిపోతున్నారు. నిజంగా ఏపీలో ఉండి పోరాడితే జగన్ సర్కార్ అరెస్ట్ చేస్తే మీరే హీరో అవుతారు..

Written By: NARESH, Updated On : September 30, 2023 4:42 pm

Nara Lokesh : చంద్రబాబు అరెస్ట్ అయ్యి ఇప్పటికీ మూడు వారాలు అయ్యింది. రాజకీయాల్లో తన వారసుడిగా అనుకున్న నారా లోకేష్ ఢిల్లీకి పారిపోయి రెండు వారాలు అయ్యింది. పార్టీకి దిశాదశా నిర్ధేశం చేసే నాయకుడు లేకుండా పోయారు. చంద్రబాబు గైర్హాజరీలో పార్టీని నడిపేవారు ఎవరు? సెకండ్ లీడర్ అయిన నారా లోకేష్ కాడి వదిలేసి ఢిల్లీకి పారిపోయాడు. టీడీపీ మీడియా దీన్ని పట్టించుకోకుండా కవర్ చేస్తోంది. కానీ జనం మాత్రం దీన్ని మరిచిపోరు కదా.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

చంద్రబాబు అరెస్ట్ కాగానే కొంత బాలకృష్ణ హడావుడి చేశాడు. చంద్రబాబు కుర్చీలో కూర్చొని నేనే ఓనర్ అన్నట్టుగా ఫోకస్ చేశాడు. ఇప్పుడు తెలుగుదేశాన్ని నడిపేది నారా లోకేష్, నారా బ్రాహ్మణి. వీరికి తెలుగుదేశంలో ఏ మారు మూలన క్యాడర్ ఎటువంటి వారు? ఏమైపోయారు అచ్చెన్నాయుడు.. ఏమైపోయారు మిగతా నాయకులు.. అత్యద్భుతమైన నిర్మాణం అయినటువంటి పార్టీ ఇప్పుడు ఇలా అయిపోయింది. క్యాడర్ మధ్య ఉండి బూస్ట్ ఇవ్వాల్సిన నేతలు పారిపోతున్నారు. నిజంగా ఏపీలో ఉండి పోరాడితే జగన్ సర్కార్ అరెస్ట్ చేస్తే మీరే హీరో అవుతారు..

నారా లోకేష్ ఢిల్లీకి పారిపోయి టీడీపీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాడు.. టీడీపీ పాలిటిక్స్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.