Nageswara Rao On Mohan Babu: సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు కి ఉన్న స్టార్ డమ్ మరే హీరోకి లేదనే చెప్పాలి. ముఖ్యంగా వీరిద్దరూ జానపద సినిమాలు, అలాగే రొమాంటిక్ సినిమాలకు పెట్టింది పేరుగా వెలుగొందాడు. దాసరి నారాయణరావుకి, నాగేశ్వరరావుకి మధ్య మంచి సన్నిహిత్యం ఉండేది.
అందుకే వీళ్ళ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే దాసరి గారి శిష్యుడిగా మోహన్ బాబు ఎప్పుడు ఆయన దగ్గరే ఉండేవాడు. అయితే దాసరి గారే మోహన్ బాబుకి సినిమాల్లో మొదటి అవకాశాన్ని కల్పించాడు. కాబట్టి దాసరి నారాయణరావు ను తన గురువుగా భావించి మోహన్ బాబు ఎప్పుడు తనతోనే ట్రావెల్ అవుతూ ఉండేవాడు.అయితే ఈ క్రమం లో నాగేశ్వరరావుకి, మోహన్ బాబు కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ అయితే కుదిరింది. దాంతో వీళ్ళిద్దరూ బాగా చనువుగా ఉండేవారు.
అలాంటి సమయంలో నాగేశ్వరరావు గారి సినిమా విషయం లో మోహన్ బాబు కామెడీ చేస్తే ఆయన బండ బూతులు తిట్టాడని మోహన్ బాబే ఒక సందర్భం లో తెలియజేశాడు. ఒకానొక సందర్భంలో ‘‘మా ఇద్దరిలో ఎవరు మంచి నటులు అని మోహన్ బాబు స్వయంగా నాగేశ్వరరావు గారి భార్య అయిన అన్నపూర్ణమ్మని అడిగాడట…’’ దానికి అన్నపూర్ణమ్మ గారు.. మోహన్ బాబు తో ‘‘నువ్వే మంచి నటుడివి’’ అని చెప్పింది అంటూ మోహన్ బాబు ఒక ఈవెంట్ లో స్టేజ్ మీద చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఇది చూసిన చాలా మంది అక్కినేని అభిమానులు మోహన్ బాబు ఇలాంటి నోటి దూల వల్లనే నాగేశ్వరరావు గారి చేతులు ఎప్పుడూ తిట్లు తింటూ ఉంటాడు. అంటూ చాలామంది మోహన్ బాబు మీద నెగిటివ్ గా స్పందించారు. ఎందుకంటే లెజెండరీ నటుడైన నాగేశ్వరరావు గారితో మోహన్ బాబు పోల్చుకోవడం ఎందుకు అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేశారు.