Bigg Boss 7 Telugu : గేమ్ కంటే మీమ్ హైలైట్.. లింగ్ లింగ్ లింగిడి అదిరిపోయింది!

ఇది చూసి హౌస్ మేట్స్ పడి పడి నవ్వుకున్నారు. ప్రోమో చూస్తుంటే ఇవాళ్టి ఎపిసోడ్ లో ఫుల్ ఫన్ ఉంటుంది అని తెలుస్తుంది. 

Written By: NARESH, Updated On : October 29, 2023 5:12 pm
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 ఎనిమిదో వారం వీకెండ్ ఎపిసోడ్ కావడంతో నాగార్జున కంటెస్టెంట్స్ తో కలిసి సందడి చేస్తున్నారు.తాజాగా విడుదలైన ప్రోమోలో హౌస్ మేట్స్ తో మరో కొత్త గేమ్ ఆడిస్తున్నారు నాగార్జున.ఇందుకు కంటెస్టెంట్స్ ని రెండు టీమ్స్ గా డివైడ్ చేశారు. ‘డైలాగ్ కొట్టు’ ఆటలో భాగంగా టీమ్ లో ఒకరు డైలాగ్ చెప్తారు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరొకరు ఆ డైలాగ్ గెస్ చేయాలి అని చెప్పారు నాగార్జున. ముందుగా అమర్ అల వైకుంఠపురం సినిమా లో ని ‘మేడం సార్ మేడం అంతే’ పాపులర్ డైలాగ్ చెప్పాడు. ప్రశాంత్ వెంటనే గెస్ చేశాడు.

దీంతో ‘రాములో రాములా’ సాంగ్ ప్లే చేశారు బిగ్ బాస్.దీనికి తేజ ,అశ్విని డాన్స్ చేశారు.పంప్ స్టెప్ తో పాటు.. పిడకల స్టెప్ కూడా స్టార్ట్ చేసావ్ గా తేజ అని నాగార్జున అన్నారు. పాపులర్ స్టెప్ సర్ అలా అనకండి అన్నాడు తేజ. మరి నువ్వేం చేశా అని నాగ్ అడిగారు. దానికి శివాజీ కింద పేడ తీసి గోడకి కొట్టాడు అండీ అని జవాబిచ్చాడు. తర్వాత యావర్ ‘రమణ లోడ్ ఎత్తాలి రా’ అనే డైలాగ్ ని వచ్చి రానీ తెలుగుతో ఖూనీ చేశాడు. దాన్ని గెస్ చేయడానికి శోభా తిప్పలు పడింది.

ఆ తర్వాత రతిక డైలాగ్ చెప్తూ ‘నా వల్ల నీకు ప్రాబ్లం అనుకుంటే’ అని అంటే,దానిని తేజ తారుమారు చేసి ఏదో చెప్పాడు. ఇక డీజే టిల్లు సినిమాలో ఫేమస్ డైలాగ్ ‘ఈ క్వశ్చన్ నన్ను నిజంగా అడుగుతున్నావా రాధికా’ అని ప్రియాంక చెప్పింది. సందీప్ దాదాపు గెస్ చేశాడు. కానీ చివర్లో రాధికని కాస్త తాతయ్య గా మార్చేశాడు. తర్వాత తేజ అమ్మాయిలు అంటూ డైలాగ్ మొదలు పెట్టాడు. అమర్ పూర్తిగా వినకుండా అమ్మాయిలు అదో టైపు అని చెప్పాడు.

ఇక అర్జున్ వచ్చి ‘నా పేరు శివమణి’ అని చెప్పగానే గౌతమ్ ఆంధ్రప్రదేశేనా అని అంటాడు. దీంతో వెనకున్న శివాజీ కాదు హైదరాబాద్ అంటూ పంచ్ లు వేశాడు. ఇదంతా పూర్తయిన తర్వాత మీమ్ ఆఫ్ ది వీక్ అని ఒక వీడియో చూపించారు నాగార్జున.నామినేషన్స్ లో ప్రశాంత్ ,గౌతమ్ మధ్య జరిగిన గొడవను ఫన్నీగా క్రియేట్ చేశారు మీమర్స్.ఇది చూసి హౌస్ మేట్స్ పడి పడి నవ్వుకున్నారు. ప్రోమో చూస్తుంటే ఇవాళ్టి ఎపిసోడ్ లో ఫుల్ ఫన్ ఉంటుంది అని తెలుస్తుంది.