
బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షో రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ లతో నంబర్ 1 కామెడీ షోగా నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో ఈ షోకు రోజా, నాగబాబు జడ్జీలుగా వ్యవహరించగా ప్రస్తుతం రోజా, మనో జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. నాగబాబు జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పి జీ తెలుగు ఛానల్ లో అదిరింది అనే షోకు జడ్జిగా వ్యవహరించగా ఆ షో నాగబాబు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అదిరింది షోకు ఎన్ని మార్పులు చేసినా ఆ షో సక్సెస్ కాకపోవడంతో జీ తెలుగు ఛానల్ నిర్వాహకులు ఆ షోను ఆపేశారు.
Also Read: స్వచ్ఛమైన ప్రేమకథ.. ఆర్ఆర్ఆర్ లో ‘అల్లూరి సీత’ వ్యథ!
ప్రస్తుతం నాగబాబు ఏ టీవీ ఛానల్ షోలలో పాల్గొనడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉన్న నాగబాబు గతంలో తన వ్యాఖ్యల ద్వారా కొన్ని వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రోజాను టార్గెట్ చేసి నాగబాబు చేసిన కామెంట్ గురించి నెటిజన్ల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. తాజాగా నాగబాబు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో నెటిజన్లు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆస్క్ మీ పేరుతో నెటిజన్ జబర్దస్త్ లో ఇష్టమైన కమెడియన్ ఎవరు..? అని ప్రశ్నించారు.
Also Read: చిరంజీవితో వెన్నెల కిశోర్ కామెడీ ట్రాక్ అదరనుందట..!
ఆ ప్రశ్నకు సమాధానంగా నాగబాబు రోజా పేరు చెప్పారు. నాగబాబు ఎవరూ ఊహించని సమాధానం చెప్పి నెటిజన్లు అవాక్కయ్యేలా చేశారు. రోజా స్థాయిని తగ్గించే విధంగా నాగబాబు చేసిన కామెంట్ పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగబాబు రోజాను కమెడియన్ తో ఎందుకు పోల్చారో తెలియాల్సి ఉంది. ఈ వివాదం గురించి రోజా స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
జబర్దస్త్ షోలో పాల్గొన్న సమయంలో రాజకీయపరమైన విభేదాలు ఉన్నా నాగబాబు, రోజా కలిసి పని చేశారు. కానీ ఇప్పుడు మాత్రం రోజాపై పరోక్షంగా కోపం ఉన్నట్లు నాగబాబు కామెంట్లు చేశారు. నాగబాబు కామెంట్ పై రోజా స్పందిస్తే మాత్రం వివాదం పెద్దదయ్యే అవకాశం ఉంది.