Thank You Movie Review: రివ్యూ : థాంక్యూ
నటీనటులు : నాగచైతన్య, రాశి ఖన్నా, మాళవికనాయర్ , అవికా గోర్, సంపత్ రాజ్, తులసి, సాయి సుశాంత్ రెడ్డి, ఈశ్వరి రావు, ప్రకాష్ రాజ్
దర్శకత్వం : విక్రమ్ కె కుమార్
నిర్మాత : దిల్ రాజు
సంగీత దర్శకుడు : ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ : పిసి శ్రీరామ్
ఎడిటర్ : నవీన్ నూలి

నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా థాంక్యూ. మరి ఈ రోజు విడుదల అయిన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.
Also Read: Akhil Agent: అఖిల్ యాక్టింగ్ పై డైరక్టర్ సీరియస్.. ‘ఏజెంట్’ పరిస్థితి ఏమిటి ?
కథ :
నారాయణపురం అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన అభిరామ్ (నాగ చైతన్య) హై స్కూల్ డేస్ లోనే పార్వతి (మాళవిక నాయర్)ను ప్రేమిస్తాడు. అయితే ఆమె తండ్రి కారణంగా అభిరామ్ ఫ్యామిలీ ఆ ఊరు వదిలి రావాల్సి వస్తోంది. అలాగే మరో దశలో కాలేజీ గొడవలు కారణంగా అభిరామ్ జీవితంలో అతని గోల్ మిస్ అవుతుంది. ఇక ఏమి లేని స్థాయి నుంచి అభి అమెరికా వస్తాడు. అక్కడ ప్రియ (రాశి ఖన్నా) పరిచయం అవుతుంది. ఆమె సహకారంతో వైద్య అనే యాప్ డెవలప్ చేసి సక్సెస్ అవుతాడు. ఆ సక్సెస్ తలకెక్కుతుంది. అందర్నీ దూరం చేసుకుంటాడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం అభిరామ్ లో మార్పు వస్తోంది. ఆ తర్వాత అభిరామ్ ఏమి చేశాడు ? ఎలాంటి జర్నీ స్టార్ట్ చేశాడు ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
నాగ చైతన్య, రాశి ఖన్నా ఇద్దరు తమ పాత్రలకు ప్రాణం పోశారు. లవ్ సీన్స్ నుంచి ఎమోషనల్ సన్నివేశాల వరకూ ఇద్దరు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మెయిన్ గా క్లైమాక్స్ లో చైతు నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది.
కీలక పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్, ఎప్పటిలాగే తన శైలి పాత్రలో కనిపించిన ఈశ్వరి రావు అద్భుతంగా నటించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. విక్రమ్ కె కుమార్, వాస్తవ జీవితాల్లోని సంఘటనలను, పరిస్థితులను బాగా చూపించాడు.

ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్… ఈ కథ జరిగిన నేపథ్యం బాగున్నా… సహజంగా పాత్రలు సాగవు. సినిమా చూస్తున్నంత సేపు గతంలో ఎక్కడో ఈ సీన్స్ చూశాం కదా అనే భావన కలుగుతుంది. అలాగే డైరెక్టర్ రాసుకున్న సున్నితమైన భావోద్వేగాలు కొన్ని చోట్ల బోర్ గా సాగుతాయి.
ప్లస్ పాయింట్స్ :
చైతు నటన,
కథ,
మిగిలిన నటీనటుల నటన,
ఎమోషనల్ గా సాగే లవ్ డ్రామా,
మైనస్ పాయింట్స్ :
స్లో నేరేషన్,
రెగ్యులర్ స్క్రీన్ ప్లే,
బోరింగ్ డ్రామా,
రొటీన్ సీన్స్,
అండ్ ఫేక్ ఎమోషన్స్
సినిమా చూడాలా ? వద్దా ?
నాగ చైతన్య – రాశి ఖన్నా తమ నటనతో ఈ సినిమా స్థాయిని పెంచారు. ముఖ్యంగా వారిద్దరీ కెమిస్ట్రీ చాలా బాగుంది. కాకపోతే.. బోరింగ్ ప్లే, కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.
రేటింగ్ : 2.5
Also Read: Liger Trailer: లయన్ కు, టైగర్ కు పుట్టిన క్రాస్ బీడ్ ‘లైగర్’.. ‘దేవరకొండ’ యాక్షన్ విశ్వరూపం
Recommended Videos