Homeజాతీయ వార్తలుBJP vs TRS: బీజేపీకి మరో ఆయుధం ఇచ్చిన టీఆర్ఎస్

BJP vs TRS: బీజేపీకి మరో ఆయుధం ఇచ్చిన టీఆర్ఎస్

BJP vs TRS: నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పోరాడింది. మొత్తానికి తెలంగాణను సాధించుకున్నాక నీళ్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా తెలంగాణకు ఉత్తరాన ఉన్న గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. ఇక్కడ రెండు బ్యారేజీలు, పంప్ హౌస్ లు నిర్మించి నీటిని ఇప్పటి వరకు మల్లన్న సాగర్ వరకు తీసుకు రాగలిగింది. మిగతా పనులు ఎలా ఉన్నా ఈ ప్రాజెక్టు పనులు మాత్రం ఎక్కడా ఆగకుండా పూర్తి చేయగలిగింది. అయితే మొదటిసారి అధికారంలోకి రాగానే మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం 2016,2018లో కేంద్రానికి లేఖలు రాసింది. పలు కారణాలతో అప్పటి నుంచి పెండింగులో ఉంచిన కేంద్రం తాజాగా ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దీంతో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు మరింత తీవ్రం కానుంది.

BJP vs TRS
kcr, modi

తెలంగాణలో అధికారం కోసం ఆవురావుమంటూ ఎదురుచూస్తున్న బీజేపీ.. టీఆర్ఎస్ చేసిన తప్పులను వెతుకుతోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట వేల కోట్ల రూపాయలు కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించింది. ప్రాజెక్టు కోసం భారీగా నిధులు కేటాయించి అందులో తక్కువ మొత్తాన్ని ఖర్చు చేశారని తెలిపింది. మిగతా సొమ్మును కేసీఆర్ సొంతానికి వాడుకున్నారని ఆరోపించింది. అయితే తెలంగాణ కలల ప్రాజెక్టు కాళేశ్వరమని, ఈ ప్రాజెక్టుతో కోటి ఎకరాలకు నీరు అందించేందుకే నిర్మించామని కేసీఆర్ వాదిస్తూ వస్తున్నారు. బీజేపీ నాయకులు అనవసర ఆరోపణలు చేయడమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా అవమానిస్తున్నారని అంటున్నారు.

Also Read: Rejects Arvind Kejriwal Proposal To Visit Singapore: ఆహ్వానం ఉన్నా.. అనుమతి తీసుకోవాల్సిందే.. . సీఎం అయినా అంతే!!

ఇదిలా ఉండగా.. ఇటీవల భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మోటార్లన్నీ నీట మునిగాయి. పంప్ హౌస్ లో భారీగా నీరు చేరడంతో వాటిని ఎత్తి పోస్తున్నారు. అయితే ఆ తరవాత అవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడే చెప్పలేమని సంబంధిత అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు తమ ప్రచారంలో భాగంగా ప్రపంచంలో అత్యంత నిపుణులైన ఇంజనీర్లతో ఈ ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు. అలాంటప్పుడు ఇలా నీరు చేరుతాయని తెలియదా..? అని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టును సందర్శించడానికి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ చేస్తున్న ఆరోపణలకు మరింత బలపడిందని అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో బీజేపీకి కొత్త అస్త్రం దొరికినట్లయింది. ఇన్నాళ్లు కేవలం ఈ ప్రాజెక్టుతో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని మాత్రమే ఆరోపించారు. ఇప్పుడు పంప్ హౌస్ మోటార్లు నీట మునగడంతో మరిన్ని ఆరోపణలు చేయడానికి అవకాశం దొరికిందని అంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలున్నాయని ఇప్పటికే కొందరు బీజేపీ నాయకులు ఆరోపించారు. ఇప్పుడు అవి స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఇలాంటప్పుడు జాతీయ హోదా ఎలా ఇస్తారని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట భారీగా నిధులు కేటాయించిన కేసీఆర్ ఈ పనుల్లో నైపుణ్యం లేకుండా చేశారని అంటున్నారు.

BJP vs TRS
kcr, modi

కానీ టీఆర్ఎస్ మాత్రం ఎప్పుడూ లేని వరదల కారణంగా.. ప్రకృతి వైపరీత్యంతోనే పంప్ హౌస్ లోకి నీళ్లు వచ్చాయని అంటున్నారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రస్తుతం ఎక్కడా నీటి కొరత లేదని, పంటలు సమృద్ధిగా పండుతున్నాయని అంటున్నారు. దేశానికే ఆదర్శంగా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, ఇలాంటప్పుడు జాతీయ హోదా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారని అంటున్నారు. అయితే బీజేపీ చేస్తున్న ఆరోపణలపై ఇప్పుడు టీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కుంటుందో చూడాలి.

Also Read:PM Modi- Pawan Kalyan: కోరీ మరీ పిలిచిన ప్రధాని మోదీ..తిరస్కరించిన పవన్.. అసలేంటి కథ?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular