Naa Saami Ranga Trailer: నాగార్జునా.. ఈ రోటీన్ కట్టిపెట్టి నువ్వు మారాలయ్యా..?

కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన నా సామిరంగా ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ సినిమాలో వింటేజ్ నాగార్జున కనిపించాడు అనే చెప్పాలి. ఇక గోదావరి యాసతో కుమ్మేసాడు.

Written By: Gopi, Updated On : January 9, 2024 6:04 pm

Nagarjuna

Follow us on

Naa Saami Ranga Trailer: గత కొన్ని సంవత్సరాలుగా కింగ్ నాగార్జున సరైన సినిమాలు చేయడం లేదు. నిజానికి రీసెంట్ గా ఆయన చేసిన సినిమాలు ఏవి కూడా పెద్దగా గుర్తింపును సంపాదించుకోవడం లేదు. ఇంతకుముందు నాగార్జున హీరోగా ఒక సినిమా వస్తుందంటే జనాల్లో అటెన్షన్ క్రియేట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల వల్ల ఆయన క్రెడిబిలిటీ అనేది చాలా వరకు తగ్గిపోతూ వస్తుంది. దాంతో పాటుగా తన మార్కెట్ ను కూడా చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది.

ఇక ఇలాంటి సమయంలో మరి నాగార్జున ఇప్పుడు చేసే సినిమాల మీద తనదైన దృష్టిని పెడితే తప్ప తను మళ్ళి ముందుకు సాగలేడు అనేది వాస్తవం… ఎందుకంటే ఆయన గతంలో చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ఆఫీసర్, ఘోస్ట్ లాంటి సినిమాలైతే భారీ డిజాస్టర్ లను మూట గట్టుకున్నాయి. ఇక ఇప్పుడు నా సామిరంగా సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఈ సినిమాతో నాగార్జున ఎలాంటి మ్యాజిక్ చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన నా సామిరంగా ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ సినిమాలో వింటేజ్ నాగార్జున కనిపించాడు అనే చెప్పాలి. ఇక గోదావరి యాసతో కుమ్మేసాడు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ నాగార్జున ఇక హీరోయిజం చూపించే సినిమాలు తగ్గించి బాలయ్య ఎలాగైతే భగవంత్ కేసరి సినిమా చేశాడో తను కూడ తన ఏజ్ కి తగ్గ పాత్రలు చేస్తే ఇంకా రీచ్ ఎక్కువగా ఉంటుంది అంటూ ట్రేడ్ పండితులు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఈ ఏజ్ లో కూడా సోగ్గాడే చిన్ని నాయన లాంటి పాత్రలు ఇంకా ఎన్ని రోజులు చేస్తాడు…ఇలాంటి సినిమాలు సక్సెస్ అవుతాయి అలాగే నా సామిరంగా సినిమాకి సక్సెస్ అయ్యే స్కోప్ ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇదొక ఏ గ్రేడ్ కమర్షియల్ సినిమా కానీ నాగార్జున ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఇస్తే బాగుంటుంది ఎంత సేపు హీరోయిన్స్, ఫైట్స్ అవేనా… థింక్ డిఫరెంట్ అంటూ నాగార్జున మీద చాలా మంది కామెంట్లు చేస్తున్నారు…

ఇక ఇది ఇలా ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా నాగార్జున చేస్తున్న సినిమాల్లో అసలు వైవిధ్యం ఏమి ఉండడం లేదు నార్మల్ గా స్టోరీని రాసుకొని సినిమాలు చేస్తున్నారు. అంత నాసిరకం స్టోరీలతో సినిమాలు చేయడం వల్ల నాగార్జున బ్రాండ్ అనేది పడిపోతుంది. నాగార్జున అంటే ఒక అన్నమయ్య, ఒక నిన్నేపెళ్లాడుతా లాంటి డిఫరెంట్ అటెంప్ట్ లు కావాలి. కెరియర్ బిగినింగ్ లోనే అద్భుతమైన ప్రయోగాలు చేసిన నాగార్జున ఇప్పుడు ఇలాంటి ఒక రొటీన్ సినిమాలకి ఎందుకు పరిమితమవుతున్నాడు…

ఇక ఈ సినిమా తర్వాత ప్రసన్నకుమార్ బెజవాడ అనే రైటర్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఒక సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఈ సినిమా నుంచి గ్లింప్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇప్పటికే ప్రసన్న కుమార్ బెజవాడ అంటే రొటీన్ సినిమాలను రాస్తాడు అనే టాకైతే ఉంది. ఇక ఇప్పుడు నాగార్జునతో కూడా అలాంటి రొటీన్ సినిమానే చేస్తున్నాడా లేదంటే వైవిధ్యమైన కథాంశం తో వస్తున్నాడా అనే విషయం తెలియాల్సి ఉంది…