
కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలోని పెద్దపెద్ద కోటీశ్వరులు సైతం భారీ నష్టాలను చవిచూశారు. ఎప్పుడూ లాభాల్లో ఉండే రంగాలు సైతం కరోనా, లాక్ డౌన్ వల్ల నష్టాల బాట పట్టాయి. దేశంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నా ముకేశ్ అంబానీ స్థానం మాత్రం చెక్కు చెదరలేదు. సంపన్నవంతులైన భారతీయుల జాబితాలో ఆయన తొమ్మిదో ఏడాదికూడా అగ్ర స్థానంలో నిలవడం గమనార్హం.
Also Read : తెలంగాణ టీడీపీ పగ్గాలు ఆ హీరో చేతికంట.. నిజమేనా..?
ముఖేశ్ సోదరుడు అనిల్ అంబానీ కోర్టు ఖర్చుల కోసం నగలు అమ్మేసిన దుస్థితిలో ఉంటే ముకేశ్ అంబానీ మాత్రం అంచెలంచెలుగా ఎదుగుతుండటం గమనార్హం. సంవత్సర కాలంలో ముఖేశ్ సంపాదన ఏకంగా 73 శాతం పెరిగింది. దీంతో ఆయన ఆస్తుల విలువ ఏకంగా 6.58 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవడం గమనార్హం. లాక్ డౌన్ విధించిన నాటి నుంచి ముకేశ్ అంబానీ గంటకు 90 కోట్ల రూపాయల ఆర్జిస్తున్నారు.
ముకేశ్ అంబానీ కేవలం భారత్ లోనే కాకుండా ఆసియాలోనే అపర కుబేరుల స్థానంలో నిలవడం గమనార్హం. తొలి స్థానంలో ఉన్న ముకేశ్ సంపద 6.58 లక్షల కోట్లు కాగా రెండో స్థానంలో ఉన్న హిందూజాల సంపద కేవలం 1.43 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే . ముకేశ్ అంబానీ ప్రపంచ అపర కుబేరుల జాబితాను పరిశీలిస్తే ఆ జాబితాలో నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం.
ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ విషయాలను వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గడిచిన సంవత్సర కాలంలో రిటైల్ విభాగాల్లోని వాటాలను విక్రయించింది. ఫలితంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ఈ స్థాయిలో సంపద పెరిగింది. దేశంలో గత నెల 31 నాటికి 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ నికర సంపద ఉన్న భారతీయులు 828 మంది ఉండటం గమనార్హం.
Also Read : లాక్డౌన్ నష్టాలను పూడ్చుకుంటున్న రామోజీరావు?