MS Dhoni : చెన్నై టీమ్ ని స్ట్రాంగ్ చేయడానికి ధోనీ వేసిన మాస్టర్ ప్లాన్ ఇదేనా..?

ధోనికి కూడా ఇదే లాస్ట్ సీజన్ అని చెప్తూ వస్తున్నప్పటికీ తన ఫ్యాన్స్ ఆశ భావం మేరకు ఇంకో సీజన్ కూడా ఆడతాడా అనేది తెలియాల్సి ఉంది.

Written By: NARESH, Updated On : December 4, 2023 10:37 am
Follow us on

MS Dhoni : ఐపీఎల్ అంటే అందరికీ ఎక్కువగా గుర్తుకొచ్చే పేరు చెన్నై సూపర్ కింగ్స్ ఈ టీం ఇప్పటికే ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకొని తమ సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక చెన్నై టీం కి మొదటి నుంచి ఇప్పటివరకు మహేంద్రసింగ్ ధోని కెప్టెన్ గా కొనసాగుతూ వచ్చాడు.ఇన్ని సీజన్లకి ఒక్కడే కెప్టెన్ గా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. ప్రతి టీం యొక్క కెప్టెన్లు మారారు కానీ చెన్నై సూపర్ కింగ్స్ టీం యొక్క కెప్టెన్ మాత్రం ఎప్పుడు ధోనినే ఉంటూ వస్తున్నాడు.

గత సంవత్సరమే ఐపీఎల్ నుంచి రిటర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు కానీ అందరికీ షాక్ ఇస్తూ 2024 లో కూడా తను తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. ఇక అందులో భాగంగానే ధోని మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టుగా తెలుస్తుంది. 2024 లో రుతురాజ్ గైక్వాడ్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి తను ప్లేయర్ గా కంటిన్యూ అవుతూనే దగ్గరుండి ఆయనకి కెప్టెన్సీలో సలహాలు సూచనలు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక తను ఆడేది ఇది లాస్ట్ సీజన్ అయిన, కాకపోయినా గైక్వాడ్ ని మాత్రం ఒక పవర్ఫుల్ కెప్టెన్ గా తయారు చేసిన తర్వాతనే ఆయన చెన్నై సూపర్ కింగ్స్ టీంను వీడబోతున్నట్టుగా సమాచారం అందుతుంది… అయితే గైక్వాడ్ ఇప్పటికే చైనా నిర్వహించిన ఏషియన్ గేమ్స్ లో ఇండియన్ టీం కి గోల్డ్ మెడల్ ని సంపాదించి పెట్టాడు.

కాబట్టి ఆయనని కెప్టెన్ గా చేస్తే టీమ్ మరింత బలపడుతుంది అనే ఉద్దేశ్యం తోనే ధోని గాని, చెన్నై యాజమాన్యం గాని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక చెన్నై టీం కి ధోని తర్వాత ఆయన వారసుడు గైక్వాడనే విషయం అయితే చాలా స్పష్టం గా తెలుస్తుంది. ఇక ఇంతకుముందు రవీంద్ర జడేజా కి కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించినప్పటికీ అతను నిరూపించు కోలేకపోయాడు. దాంతో ఇప్పుడు గైక్వాడ్ కి అవకాశం ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. మరి గైక్వాడ్ ఆయనకి వచ్చిన అవకాశాన్ని కరెక్ట్ గా వాడుకుంటాడో లేదో తెలియాలంటే 2024 ఐపీఎల్ మ్యాచ్ లు జరిగేంతవరకు ఎదురు చూడాలి…

ధోనికి కూడా ఇదే లాస్ట్ సీజన్ అని చెప్తూ వస్తున్నప్పటికీ తన ఫ్యాన్స్ ఆశ భావం మేరకు ఇంకో సీజన్ కూడా ఆడతాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే ధోనీకి మ్యాచ్ లు ఆడడానికి తన బాడీ అంత సపోర్ట్ చేయట్లేదు అనే విషయాలైతే తెలుస్తున్నాయి కానీ తన ఫ్యాన్స్ ని నిరుత్సాహ పరచకూడదు అనే ఒకే ఒక ఉద్దేశ్యం తో తను మ్యాచ్ లు ఆడుతున్నట్టుగా గతంలో ధోని కూడా తెలియజేశాడు…