సాధారణంగా మనకు ఎటువంటి కష్టాలు లేకుండా ఆ లక్ష్మి దేవి అనుగ్రహం కలగాలంటే ప్రతిరోజు ఉదయం ఇంటిని శుభ్రపరచుకుని పూజలు నిర్వహిస్తుంటారు. మన ఇంట్లో శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.ఈ విధంగా ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రపరుచుకుని పూజ చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అయితే ఉదయం ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా పరగడుపున ఒక స్పూన్ పెరుగును తిని వెళ్లడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా స్పూన్ పెరుగు చక్కెరను కలిపి తీసుకుని వెళ్ళటం వల్ల మనం బయలుదేరిన పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి.
Also Read: వివిధ రకాల బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న అర్థం ఏమిటో తెలుసా..?
ఇదే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే గురువారం ముత్తైదువును ఇంటికి పిలిచి పసుపు కుంకుమ వంటి శుభప్రదమైన వస్తువులను దానం చేయడం వల్ల దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారు. గురువారం లక్ష్మీదేవికి పూజ చేసి పేదలకు తెల్లని వస్తువులను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుంది. ప్రతిరోజు మనం భోజనం చేసేటప్పుడు తొలిముద్ద తీసి పక్కన పెట్టాలి. భోజనం అనంతరం దానిని ఆవుకి పెట్టడం వల్ల ఎప్పుడు సుఖ సంతోషాలతో, సకల సంపదలను కలిగి ఉంటారు.
Also Read: నెమలి పించం ఇంట్లో పెట్టుకుంటున్నారా… అయితే ఏం జరుగుతుందో తెలుసా..!
పరగడుపున చక్కెర పెరుగు కలిపి తీసుకోవడం వల్ల పనులు విజయవంతం అవడమేకాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్లు అధికంగా ఉండటం వల్ల మన ప్రేగులలో ఏర్పడిన పదార్థాలను బయటకు పంపడంలో తోడ్పడతాయి.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం