Homeజాతీయ వార్తలుModi -G20 : జీ20 కోసం కాశ్మీర్ తో పాటు ఢిల్లీని కూడా తవ్వుతున్న మోడీ

Modi -G20 : జీ20 కోసం కాశ్మీర్ తో పాటు ఢిల్లీని కూడా తవ్వుతున్న మోడీ

Modi -G20 : ఆ మధ్య మనం చెప్పుకున్నాం కదా.. జీ20 సదస్సు కాశ్మీర్లో నిర్వహిస్తున్నారని… ఇందుకోసం అజిత్ దోవల్ ఏర్పాట్లు చేస్తున్నారని… దీనిపై చైనా, పాకిస్తాన్ అంతర్గతంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని.. కానీ అందరూ అనుకున్నట్టు మోదీ కాశ్మీర్ వద్దే ఆగలేదు.. “నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో” అన్నట్టు… కాశ్మీర్ విషయాన్ని ప్రపంచం ముందు ఉంచుతూనే.. ఇప్పుడు ఢిల్లీని తవ్వే పని చేపట్టాడు మోదీ.. అంతేకాదు తరతరాలుగా మరుగున పడేసిన హిందుత్వ చరిత్రను, దానిని కాలగర్భంలో కలిపేందుకు కారకులైన వారిని నడి బజార్లో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

ఢిల్లీలో పురాణ ఖిల్లా అనే ఒక ప్రాంతం ఉంది. మొన్నటిదాకా ఇది శిధిలమై, శల్యమై ఉండేది.. కానీ ఇప్పుడు దానిని భారత పురావస్తు శాఖ అధికారులు తవ్వుతున్నారు.. పురావస్తు శాస్త్రవేత్త వసంత్ స్వర్ణకర్ ఆధ్వర్యంలో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి.. క్రీస్తుపూర్వం 9 శతాబ్దం క్రితం ఢిల్లీ కేంద్రంగా మౌర్యులు, శుంగలు, కుషాణులు, గుప్తులు, రాజ పుత్రులు, సుల్తా నేట్లు, మొగలుల కాలాల వరకు వివిధ నిక్షేపాలు కనుగొన్నారు.. ఈ సెప్టెంబర్ లో జి20 ప్రతినిధుల సమావేశం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇక్కడ కనుగొన్న పురాతన వస్తువులను ప్రదర్శించనున్నారు. కానీ అంతకుముందే పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత బీబీ లాల్ 1954లో పురానా ఖిల్లా మైదానంలో తవ్వకాలు చేపట్టారు.. మధ్యలో ఎందుకో ఆపేశారు. 1969 నుంచి 1973 వరకు జరిపిన విస్తృతమైన తవ్వకాలలో పలు ఆనవాళ్లు కనిపించాయి.. వాటిపై అనేక పరిశోధనలు చేసిన తర్వాత అవి మహాభారత కాలానికి చెందినవని గుర్తించారు.. ఈ తవ్వకాలలో ఇందర్ పాత్ అనే నగరం ఆనవాళ్లు కనిపించాయి.. ఈ నగరం ప్రస్తావన ప్రాచీన భారతీయ సాహిత్యంలోనే కాకుండా పర్షియన్ సాహిత్యంలో కూడా ప్రస్తావించి ఉందని తెలిసింది.. అంతేకాదు పాండవులు కోరుకున్న ఐదు ప్రదేశాలలో ఇది ఒకటి అని పురావస్తు శాస్త్రవేత్త కేకే మొహమ్మద్ 2015 దూరదర్శన్ సిరీస్ లో వివరించారు.

పురాణ ఖిల్లా ప్రాంతం ఇంద్రప్రస్థ పాండవ రాజ్యమని లాల్ పరిశోధనలో తేలింది.. ఇక ఈ కోట ప్రాంతాలలో బూడిద రంగు కుండలు బయల్పడగా… క్రీస్తుపూర్వం ఆరు నుంచి 12 శతాబ్దాలు నాటివని తెలుస్తోంది.. ఆ కాలాన్ని పెయింటెడ్ గ్రే వేర్(బూడిద రంగు వర్ణం) అనే పిలిచేవారు అని తెలుస్తోంది. కోట, పాండవ రాజ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని భారత ప్రభుత్వం కూడా గుర్తించింది.. పాండవుల పురాతన రాజధాని ఇంద్రప్రస్థ స్థలంలో హుమాయున్ కోట నిర్మించినట్టు వివరించింది. 1913 వరకు కోట గోడల లోపల ఇందర్పాత్ అనే గ్రామం ఉండేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.. బ్రిటిష్ వారు ఆధునిక రాజధాని నిర్మించడం ప్రారంభించినప్పుడు ఇందర్ పాత్ గ్రామాన్ని తరలించారు.. అయితే ఈ తవ్వకాలు పురాతన ఢిల్లీ చరిత్రను, అరుగున పడిపోయిన ఢిల్లీ గొప్పతనాన్ని తెలియజేస్తాయని స్వర్ణకర్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ తవ్వకాలలో దొరికిన కొడవలి, పరేర్లు, టెర్రకోట బొమ్మలు, కొలిమిలో కాల్చిన ఇటుకలు, పూసలు, తీల్స్ వంటి కొన్ని కళాఖండాలు పురావస్తు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.

ఇప్పుడే ఎందుకు?

జీ 20 సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం భారతదేశానికి రావడంతో.. భారతదేశం ఒకప్పుడు సాంస్కృతికి ఆలవాలంగా నిలిచిందని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ తవ్వకాలకు సంబంధించి గతంలో లభించిన ఆనవాళ్లు, బయటకు రానీయకుండా తలెత్తిన పరిస్థితులు, అప్పటి ప్రభుత్వం ఒత్తిళ్ల పై స్వర్ణకర్ తో పలు మార్లు భేటీ అయ్యారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణకర్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. తవ్వకాలలో భాగంగా దొరికిన ఆనవాళ్లను ప్రదర్శనకు ఉంచనున్నారు.. దీని ద్వారా వలసవాదుల వల్ల భారత్ ఎంత నష్టపోయిందో వివరించే ప్రయత్నం చేయనున్నారు.. అటు కాశ్మీర్లో సదస్సు నిర్వహించడం ద్వారా పాకిస్తాన్ దేశాన్ని బోన్లో నిలబెట్టి, అంతర్జాతీయ సమాజం దృష్టిలో తప్పులు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి g20 సదస్సు ద్వారా భారతదేశానికి డబుల్ ఇంపాక్ట్ కలిగిస్తున్నారు మోడీ… భారత్ చేపట్టే ఏ కార్యక్రమాన్ని కైనా రకరకాల వక్రీకరణలు చేసే చైనా, కేంద్ర చేపట్టే ప్రతి పనిని భూతద్దంలో పెట్టి చూసే ప్రతిపక్షాలు.. ఢిల్లీలో తవ్వకాలపై మాట కూడా మాట్లాడటం లేదు.. అంటే మాడువాసన బాగానే వస్తున్నట్లు లెక్క!

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular