TS Cabinet Decisions : ఎన్నికలొచ్చాయి.. కేసీఆర్ వరాలొచ్చాయి..

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కేసీఆర్ దెబ్బకు ప్రభుత్వ ఉద్యోగులు అయిపోయారు. ఇన్నాళ్లు చాలీచాలనీ జీతాలు, ఉద్యోగ భద్రత లేకుండా అగచాట్లు ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ ఒక్క నిర్ణయంతో ప్రభుత్వంలో చేరిపోయారు.

Written By: NARESH, Updated On : July 31, 2023 9:08 pm
Follow us on

TS Cabinet Decisions : సార్ కు ఎన్నికలు వస్తేనే ప్రజల కోరికలు గుర్తుకు వస్తాయి. ఈ నాలుగేళ్లు అస్సలు పట్టవు. ఆర్టీసీ కార్మికులు గొంతుచించుకున్నా.. ప్రయాణికులు ఆర్తనాదాలు చేసినా వినిపించవు. ఇప్పుడే వినిపిస్తాయి. ఎందుకంటే వచ్చేది ఎన్నికల సంవత్సరం కాబట్టి.. ఇప్పుడు జనాలు అవసరం కాబట్టి. అందుకే ఠంచనుగా మంత్రులందరినీ పిలిపించేసి ఆరు గంటలు కూర్చుండబెట్టేసి కేబినెట్ మీటింగ్ లో వరాలు ఇచ్చేశాడు కేసీఆర్ సార్..

ఎన్నోళ్లో వేచిన సాయంత్రం ఆర్టీసీ కార్మికులకు ఈరోజు వచ్చేసింది. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కేసీఆర్ దెబ్బకు ప్రభుత్వ ఉద్యోగులు అయిపోయారు. ఇన్నాళ్లు చాలీచాలనీ జీతాలు, ఉద్యోగ భద్రత లేకుండా అగచాట్లు ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ ఒక్క నిర్ణయంతో ప్రభుత్వంలో చేరిపోయారు. ఈ కేబినెట్ భేటిలో అత్యధిక లబ్ధి వారికే చేకూరింది.తెలంగాణ ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

-కేసీఆర్ కేబినెట్ నిర్ణయం

-ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనంతో 43373మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. దీని విధివిధానాల కోసం సబ్ కమిటీ వేశారు.

-మూడు, నాలుగేళ్లలో భారీగా హైదరాబాద్ చుట్టుపక్కల మెట్రో విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇది ఖచ్చితంగా వచ్చేసారి గెలిస్తే ఆ దఫా చివరి దశలో విస్తరణ చేపడుతారు. మరో 10 ఏళ్లో పూర్తి అవుతుంది. ఇది కేసీఆర్ సర్కార్ పై భారం పడదు. వచ్చే ప్రభుత్వంపైనే భారం..

-వరద బాధితులకు తక్షణ సహాయంగా 500 కోట్లు కేటాయించారు.

ఇవన్నీ నిర్ణయాలు కేవలం ఓట్లు కొల్లగొట్టేందుకేనని విశ్లేషకులు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇన్నిరోజులుగా ఆర్టీసీ కార్మికులు కోరితే  ఇప్పుడు అమలు చేయడం వెనుక మతలబు అదేనంటున్నారు.