https://oktelugu.com/

బిచ్చగాడిగా మారిన కోటీశ్వరుడు.. అసలేం జరిగిందంటే..?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక కోటీశ్వరుడు బిచ్చగానిగా మారాడు. కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నా గత రెండు సంవత్సరాలుగా ఆ వ్యక్తి బిచ్చగానిగానే జీవనం సాగిస్తున్నాడు ఇలా బిచ్చగాడిగా జీవనం సాగిస్తున్న ఆ వ్యక్తి పేరు రమేష్. గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మున్సిపల్ సిబ్బంది, జిల్లా అధికారులు నగరంలోని అనాథ వ్యక్తులను ఆదుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. Also Read: పోస్టాఫీస్ లో ఖాతా ఉన్నవారికి షాక్.. విత్ డ్రా, డిపాజిట్లపై చార్జీల వసూలు..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 4, 2021 / 06:49 PM IST
    Follow us on

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక కోటీశ్వరుడు బిచ్చగానిగా మారాడు. కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నా గత రెండు సంవత్సరాలుగా ఆ వ్యక్తి బిచ్చగానిగానే జీవనం సాగిస్తున్నాడు ఇలా బిచ్చగాడిగా జీవనం సాగిస్తున్న ఆ వ్యక్తి పేరు రమేష్. గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మున్సిపల్ సిబ్బంది, జిల్లా అధికారులు నగరంలోని అనాథ వ్యక్తులను ఆదుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

    Also Read: పోస్టాఫీస్ లో ఖాతా ఉన్నవారికి షాక్.. విత్ డ్రా, డిపాజిట్లపై చార్జీల వసూలు..?

    అధికారులు అనాథలకు పునరావాసం కల్పించే ప్రయత్నం చేయగా వాళ్లకు బిచ్చగానిగా మారిన రమేష్ అనే కోటీశ్వరుడి గురించి తెలిసింది. దీనబంధు పునరావాస యోజన పథకంలో 109 మంది అనాథలను అధికారులు గుర్తించగా వారిలో రమేష్ యాదవ్ ఒకరు. యాచకునిగా జీవనం సాగిస్తున్న రమేష్ యాదవ్ కోటీశ్వరుడని తెలిసి అధికారులు సైతం అవాక్కయ్యారు. పెళ్లి కూడా చేసుకోని రమేష్ ఇంటి అడ్రస్ ను తెలుసుకుని అధికారులు ఆ ఇంటికి వెళ్లారు.

    Also Read: 2 నెలల్లో రూ.6,000 తగ్గిన బంగారం.. అప్పుడు పెరిగే ఛాన్స్..?

    రమేష్ చెప్పిన అడ్రస్ లో సకల సౌకర్యాలు ఉండటంతో అధికారులు సైతం అవాక్కయ్యారు. రమేష్ యాదవ్ కు ఉన్న మద్యం అలవాటే అతని దీనస్థితికి కారణమని తెలిసి అవాక్కవడం అధికారుల వంతైంది. రమేష్ కు సొంతంగా ఒక భవనం, ఫ్లాట్ ఉండగా వాటిని అమ్మడం ఇష్టం లేక డబ్బు కోసం రమేష్ యాచకునిగా మారినట్లు సమాచారం. రోజూ విపరీతంగా మద్యం తాగే అలవాటు ఉన్న రమేష్ ఆ అలవాటు వల్ల ఆలయం దగ్గర బిచ్చమెత్తుతూ కాలం గడిపాడు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    అధికారులు రమేష్ కు కౌన్సిలింగ్ ఇచ్చి మద్యం అలవాటును మాన్పించారు. రమేష్ ఆరోగ్యం మెరుగుపడగా ఇకపై మద్యానికి దూరంగా ఉంటానని రమేష్ చెబుతున్నాడు. ఇకపై యాచన చేయనని రమేష్ చెప్పడం గమనార్హం.