Chiranjeevi Acharya: మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడుతున్నారు. ఒక సినిమాని జనంలో తీసుకువెళ్ళడానికి, గతంలో ఎన్నడూ చిరు ఇంతలా కష్టపడింది లేదు. కానీ.. ఆచార్య విషయంలో మాత్రం చిరు ఇంతగా ప్రమోట్ చేయడానికి కారణం.. ఈ సినిమా ఓన్ సినిమా. పేరుకి నిరంజన్ రెడ్డి నిర్మాత అని కార్డు వేసినా.. వచ్చే లాభాల్లో 70 % వాటా మెగా ఫ్యామిలీకే వెళ్తుంది. అందుకే.. తన చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకోవడం కోసం చిరు చాలా రకాల ప్రయత్నాలు చేశారు.

ఎట్టకేలకు ప్రభుత్వాల దగ్గర ఉన్న తన పరపతితో ఇటు తెలంగాణాలోనూ, అటు ఆంధ్రపదేశ్ లోనూ టికెట్ రేట్లు పెంచేలా జీవోలు రిలీజ్ చేయించుకున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’కి రెండు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు బాగా పెరిగాయి. “ఆర్ఆర్ఆర్” అంటే భారీ బడ్జెట్. కానీ ఆచార్య పాన్ ఇండియా చిత్రం కాదు కదా ? ఇలాంటి నెగిటివ్ ప్రశ్నలకు కూడా చిరంజీవినే ముందుకు వచ్చి సమాధానాలు చెబుతున్నారు.
Also Read: Acharya: ఆచార్య రీ షూట్స్ జరగడానికి కారణం అదేనా.. ఆందోళనలో ఫాన్స్
ఆచార్య సినిమా మేకింగ్ బాగా లేట్ అయిందని, రెండేళ్లు పాండమిక్ వల్ల బాగా నష్టపోయాం అని.. ఇంకా ఎకౌంట్స్ కూడా కొన్ని సెటిల్ చెయ్యలేదు అని.. బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. అందుకే.. టికెట్ రేట్లు పెంచాం’ అంటూ చిరు తన వాదన వినిపిస్తున్నారు. అన్నిటికి మించి ఆచార్య చిత్రానికి ఎర్లీ ప్రీమియర్స్ పడేలా చిరు ప్రభుత్వ పెద్దలతో ఆల్ రెడీ మాట్లాడి ఒప్పించారు.
రేపు నైట్ 12 తర్వాత చాలా చోట్ల ‘ఆచార్య’ ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. ఈ షో టికెట్ రేటు రెండు వేల నుంచి 5 వేలు నడుస్తోంది. నిజానికి ఈ విషయంలో ఆర్ఆర్ఆర్ కి కూడా పర్మిషన్ దొరకలేదు. ఐతే, ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఈ షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశాజనకంగా ఉన్నాయి. అటు యూఎస్ లోనూ ఈ చిత్రం ప్రీ సేల్స్ ద్వారా హాఫ్ మిలియన్ డాలర్స్ కు చేరువైంది. ఈ నెంబర్స్ మరింతగా పెరగనున్నాయి.

పైగా డిస్ట్రిబ్యూటర్స్ కు కూడా చిరు చాలా షరతులు పెట్టారు. లెక్కల్లో ఎలాంటి లొసుగులు లేకుండా.. తెగిన టికెట్లు అన్నీ పర్ఫెక్ట్ లెక్కలతో తన ముందుకు రావాలని చిరు ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేశాడు. గతంలో ఇలా ‘అల్లు అరవింద్’ మగధీర సినిమాకి చేశారు. ఆ తర్వాత మళ్లీ ఆచార్య సినిమాకి చిరు ఇలా డిస్ట్రిబ్యూటర్స్ ను కూడా కంట్రోల్ పెడుతూ కలెక్షన్స్ పై ఓ కన్ను వేసి ఉంచారు.
మొత్తానికి చిరులో చాలా మార్పులు వచ్చాయి. కమర్షియల్ గా సినిమాలు చేయడం చిరుకి మొదటి నుంచి ఇష్టం లేదు. కానీ, ప్రస్తుతం డబ్బులు కోసం వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే సెట్స్ పై నాలుగు సినిమాలున్నాయి. మరో ఐదు కథలు రెడీగా ఉన్నాయి. అందుకే.. ఇండస్ట్రీలో ‘చిరంజీవి డబ్బు మనిషి’ అయిపోయాడు అంటూ కామెంట్లు విసురుతున్నారు. ఎవరు ఏమనుకున్నా చిరు మాత్రం 8 సినిమాలను పక్కాగా ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మొత్తమ్మీద చిరంజీవి డబ్బు చుట్టూ తిరుగుతుంటే.. చిరంజీవి చుట్టూ సినిమాలు తిరుగుతున్నాయి.
Also Read:Megastar Chiranjeevi: మెగా ఫ్యామిలీ ‘కపూర్ ఫ్యామిలీ’లా కావాలనుకున్నా – చిరంజీవి
Recommended Videos: