Homeఎంటర్టైన్మెంట్Acharya: ఆచార్య రీ షూట్స్ జరగడానికి కారణం అదేనా.. ఆందోళనలో ఫాన్స్

Acharya: ఆచార్య రీ షూట్స్ జరగడానికి కారణం అదేనా.. ఆందోళనలో ఫాన్స్

Acharya: కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా మరో రెండు రోజుల్లో మన ముందుకి రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..దాదాపుగా మూడేళ్ళ నుండి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ..షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యినప్పటికీ కూడా కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది..ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకపోవడం తో ఈ సినిమా విడుదల కి సిద్ధం అయ్యిపోయింది..ఈ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక్క ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..#RRR సినిమా తర్వాత మళ్ళీ ఆయన వెండితెర మీద కనిపించబోతున్న మూవీ ఇదే..అంతే కాకుండా చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి ఒక్క పూర్తి స్థాయి సినిమా చెయ్యడం కూడా ఇదే తొలిసారి..అందుకే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Acharya
Acharya

ఇది ఇలా ఉండగా ఈ సినిమా లో కొన్ని సన్నివేశాలు చిరంజీవి కి నచ్చకపోవడం తో రీ షూట్స్ చేసారు అనే వార్త గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది..సినిమా ఔట్పుట్ సరిగా రాకపోవడం వల్లే అలా రీ షూట్స్ చేసారు అని, ఈ సినిమా అభిమానులను నిరాశపర్చబోతుంది అని ఇలా పలు రకాల రూమర్స్ తెగ ప్రచారం జరిగాయి..ఇదే విషయం ని కొరటాల శివ దృష్టికి తీసుకొని రాగ, ఆయన ఈ వార్తలను కొట్టిపారేశారు.

Also Read: Megastar Chiranjeevi: మెగా ఫ్యామిలీ ‘కపూర్ ఫ్యామిలీ’లా కావాలనుకున్నా – చిరంజీవి

ముందుగా నేను రాసుకున్న స్క్రిప్ట్ ఏదైతే ఉందొ..దానినే నేను తీసాను అని..ఒక్క సన్నివేశం ని తొలగించినట్టు గాను , కొన్ని సన్నివేశాలు మధ్యలో యాడ్ చేసినట్టు గాని ఏమి జరగలేదు అని..చిరంజీవి గారికి మొదటి కాపీ చూపించిన తర్వాత ఆయన ఎంతగానో సంతృప్తి చెందారు అని..ఎలాంటివో రీ షూట్స్ చెయ్యలేదు అని చెప్పుకొచ్చారు..కానీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మీద ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకే కొరటాల శివ అలా సర్ది చెప్పుకున్నారు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఈ రెండిట్లో ఏది నిజమో తెలియాలి అంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Acharya
Acharya

ప్రస్తుతం ఈ సినిమా ప్రొమోషన్స్ లో తెగ బిజీ గా గడుపుతున్నారు ఆ చిత్రం యూనిట్..సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఆచార్య సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూ వీడియోస్ కనిపిస్తున్నాయి..ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యిపోయాయి..ఓవర్సీస్ లో అప్పుడే ఈ సినిమా ప్రీ సేల్స్ ద్వారా 4 లక్షల డాలర్స్ ని వసూలు చేసింది..ప్రస్తుతం ట్రెండ్ ని బట్టి చూస్తుంటే ఈ మూవీ ప్రీమియర్స్ నుండి కచ్చితంగా 8 లక్షల డాలర్స్ ని వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాల అంచనా..ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా జరుగుతున్నాయి..ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టి చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి పార్ట్ 2 మొదటి రోజు వసూళ్లను అధిగమించనుంది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..చూడాలి మరి మెగాస్టార్ మాస్ ఎలా ఉండబోతుందో.

Also Read:NTR – Rajamouli: ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా ఏమిటో తెలుసా?

Recommended Videos:

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

3 COMMENTS

  1. […] KGF 2: ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ 2` బాక్సాఫీస్‌ పై ఇంకా దాడి చేస్తూనే ఉంది. ఏప్రిల్ 14న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మొత్తానికి కేజీఎఫ్ 2`కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular