Waltair Veerayya Trailer : ఒక డ్రగ్ స్మగ్లర్.. పేదల కోసం ఎలా నిలబడ్డాడు.. ఎలా పోరాడాడు. అడ్డు వచ్చిన మాఫియాను, బడాబాబులను , పోలీసులను ఎలా ఎదురించాడు… ఆద్యంతం చిరంజీవి మాస్, యాక్షన్, గ్రేస్ కలగలిపి.. బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు వస్తోంది ‘వాల్తేరు వీరయ్య’ మూవీ. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అసలు మాస్ జనాలకు పూనకాలు తెప్పించేలా ఉంది. మునుపటి ముఠామేస్త్రీ చిరంజీవి ని కళ్లకు కట్టేసింది.

పూనకాలు లోడింగ్ అంటూ ఊగిపోయే చిరంజీవి ఫ్యాన్స్ కు ఈ ట్రైలర్ చూశాకే నిజంగానే పూనకాలు వచ్చేశాయి. ఎందుకంటే పిక్చరైజేషన్ నభూతో నభవిష్యతిగా ఉంది. డైరెక్షన్ , సినిమాటోగ్రఫీ తెరపై చించేశారు. వాల్తేరు వీరయ్య మూవీలో హైలెట్ ఏంటంటే ‘ఆర్థర్ ఏ విల్సన్’అందించిన సినిమాటోగ్రఫీ హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉంది. చిరంజీవి ఓ పాతికేళ్లు వెనక్కి జరిగినట్టు ఉంది. ఇక డైరెక్షన్ అనుకున్నదానికంటే బాబీ చింపేశాడని అర్థమవుతోంది. చిరంజీవిని చూపించిన విధానం.. ఫైట్లు, పాటలు, ఎమోషన్ లో అదిరిపోయిందనే చెప్పాలి.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ చూస్తే ఒక మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా చెప్పొచ్చు. ఇందులో రవితేజ కమిషనర్ గా ఒక పవర్ ఫుల్ తెలంగాణ పోలీస్ అధికారిగా కనిపిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, సత్యరాజ్ సహా భారీ తారగణం ఈ సినిమాలో నటిస్తోందని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

ముఖ్యంగా ట్రైలర్ లో చిరంజీవి వింటేజ్ మాస్ లుక్ కు పూనకాలు రావడం ఖాయమని ఆయన బాడీ లాంగ్వేజ్ ను బట్టి తెలుస్తోంది. డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్ చూస్తుంటే అదరిపోయేలా ఉన్నాయి. లాస్ట్ లో రవితేజ్ కు తనదైన మాస్ డైలాగ్స్ తో ఇచ్చిపడేసిన చిరంజీవిని ఇలా చూసి చాలా రోజులైంది. చాలా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా తీసినట్టుగా కనిపిస్తోంది.
ట్రైలర్ చూస్తేనే కడుపు నిండిపోయింది.. ఇక సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. చూస్తుంటే సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్ ఖచ్చితంగా చిరు ‘వాల్తేరు వీరయ్య’నే అనిపిస్తోంది. నిన్న విడుదలైన బాలయ్య ‘వీరసింహారెడ్డి’ కంటే కూడా ఈ ట్రైలర్ బాగుందని చెప్పొచ్చు.