
ఈ ప్రపంచంలో ఎంతోమంది వింత వ్యక్తులు ఉంటారు. కొందరు వాళ్ల ప్రవర్తన వల్ల వింత వ్యక్తులు అని అనిపించుకుంటే మరి కొంతమంది మాత్రం ఆహారపు అలవాట్ల వల్ల వింత వ్యక్తులుగా పిలవబడతారు. అలా వింత ఆహారపు అలవాట్లను పాటించే వారిలో మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రామ్‌దాస్ బోడ్కే ఒకరు. గడిచిన 32 సంవత్సరాలుగా రామ్ దాస్ బోడ్కే కేవలం రాళ్లు మాత్రమే తింటూ జీవిస్తుండటం గమనార్హం.
వినడానికి ఆశ్చర్యంగా ఉనా ఆ వ్యక్తి ప్రతిరోజూ 250 గ్రాముల రాళ్లను ఆహారంగా తీసుకుంటున్నాడు. ఒకప్పుడు రామ్ దాస్ బోడ్కే అందరిలా ఆహారం తినేవాడట. అయితే ఒకానొక సమయంలో తీవ్రమైన కడుపునొప్పి రావడంతో అప్పటినుంచి రాళ్లు మాత్రమే తింటున్నాడని.. రాళ్లను ఆహారంగా తీసుకుంటున్నా అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదని అతని కుటుంబ సభ్యులు చెబుతుండటం గమనార్హం.
1973 సంవత్సరంలో రామ్ దాస్ కు కడుపు నొప్పి సమస్య రాగా ఆ సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం రామ్ దాస్ ఎంతోమంది వైద్యనిపుణులను సంప్రదించాడు. వైద్యులు అతని కడుపునొప్పికి పరిష్కారం కనుగొనలేకపోయారు. ఆ తరువాత ఒక వృద్ధురాలు అతనికి రాళ్లు తినమని సలహా ఇచ్చింది. రాళ్లు తింటే కడుపునొప్పి తగ్గుతుందేమో అని భావించి ప్రయత్నించగా రామ్ దాస్ కు కడుపునొప్పి తగ్గింది.
రాళ్లు తిన్న తరువాత కడుపునొప్పి తగ్గడం గురించి తెలిసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. రాళ్లు తిని జీవనం సాగిస్తున్న రామ్ దాస్ గురించి తెలిసి అతనిని చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు రామ్ దాస్ సొంతూరుకు వస్తుండటం గమనార్హం.