Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సుముహూర్తం దగ్గర పడుతోంది. మరి కొన్ని గంటల్లో భారతీయు 500 ఏళ్ల కల సాకారం కాబోతోంది. రాముడు నడయాడిన నేల అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాల రాముడు కొలువుదీరబోతున్నాడు. ఈమేరకు రామజన్మభూమీ తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. శ్రీరామ పట్టాభిషేకం తరహాలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అతి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. భద్రతా కారణాల దృష్ట్యా 7 వేల మంది అతిథుల సమక్షంలో రామాలయంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరుగబోతోంది. దేశ, విదేశాల నుంచి అతిథులు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు.
రామని ప్రకటించిన కాంగ్రెస్..
ఇక, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు దేశంలో సుమారు 5 వేల మందికి ఆహ్వానాలు పంపించింది. ఇందులో సాధువులు, వ్యాపారవేత్తలు, కళాకారులు, సినిమా నటులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు. అందరితోపాటు కాంగ్రెస్ పెద్దలను కూడా ఆయోధ్యకు రావాలని ట్రస్టు ఆహ్వానం పంపించింది. అయితే, రామాలయ ప్రారంభోత్సవాని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సొంత కార్యక్రమంలా నిర్వహిస్తున్నాయని, ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, యూపీఏ కన్వీనర్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు.
ఆ సమాధి దర్శనానికి మాత్రం వెళ్లారు..
అయోధ్య ప్రాణ ప్రతిష్టకు దూరంగా ఉండాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. ప్రత్యేక ఆహ్వానం ఉన్నా భారతీయుల 500 ఏళ్ల ఆకాంక్ష నెరవేరబోతున్న కార్యక్రమానికి రామంటున్న కాంగ్రెస్ నేతలు గతంలో ఏ ఆహ్వానం మేరకు అయోధ్య రామ మందిరాన్ని ధ్వంసం చేసిన బాబర్ సమాధి దర్శనానికి వెళ్లారని ప్రశ్నిస్తున్నారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో బాబర్ సమాధి..
అయోధ్య రామాలయాన్ని 500 ఏళ్ల క్రితం బాబర్ ధ్వసం చేశారు. దండయాత్రలో భాగంగా భారత్‌పై దండెత్తిన బాబర్ అయోధ్యలోని రామాలయాన్ని ధ్వసం చేశారని చరిత్ర చెబుతోంది. భారతీయుల అస్తిత్వాన్ని దెబ్బతీసిన బాబర్ ఆఫ్ఘనిస్తాన్‌లో మరణించారు. ఆయన సమాధి కూడా ఇప్పటికీ అక్కడ ఉంది. ఆయన సమాధి దర్శనానికి ఇదే కాంగ్రెస్ నేతలు వెళ్లిన తీరును ఇప్పుడు గుర్తుచేస్తున్నారు. ఎవరు ఆహ్వానించారని 1959లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సందర్శించారని నిలదీస్తున్నారు. 1968లో కూడా అప్పటి ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ కూడా బాబర్ సమాధిని దర్శించారు. 2005లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా బాబర్ సమాధిని దర్శించుకున్నారు. ఆలయాల దర్శనానికి దూరంగా ఉంటున్న కాంగ్రెస్ నేతలు, సమాధులను మాత్రం దర్శించుకుంటున్నారని విమర్శిస్తున్నారు. మరి కాంగ్రెస్ నేతలు ఎవరి తరఫున ఉన్నారో ఆలోచించుకోవాల్సింది ప్రజలే.