https://oktelugu.com/

నక్కతోక తొక్కిన కర్ణాటక వాసి.. 100 రూపాయలతో రూ.కోటి..?

అదృష్టం ఎవరిని ఏ విధంగా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. కర్ణాటకకు చెందిన వ్యక్తి కేరళకు వెళ్లిన సమయంలో అక్కడ కొన్న లాటరీ అతని జీవితాన్నే మార్చేసింది. స్నేహితుల బలవంతంతో వంద రూపాయలు ఖర్చు చేసి లాటరీ కొనుగోలు చేయగా కోటి రూపాయలు అతని సొంతమైంది. ఊహించని విధంగా లాటరీలో కోటి రూపాయలు సొంతం కావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పూర్తి వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రంలోని మండ్యాకు చెందిన సోహన్ బలరాం అనే వ్యక్తి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 10, 2021 / 03:19 PM IST
    Follow us on

    అదృష్టం ఎవరిని ఏ విధంగా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. కర్ణాటకకు చెందిన వ్యక్తి కేరళకు వెళ్లిన సమయంలో అక్కడ కొన్న లాటరీ అతని జీవితాన్నే మార్చేసింది. స్నేహితుల బలవంతంతో వంద రూపాయలు ఖర్చు చేసి లాటరీ కొనుగోలు చేయగా కోటి రూపాయలు అతని సొంతమైంది. ఊహించని విధంగా లాటరీలో కోటి రూపాయలు సొంతం కావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

    పూర్తి వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రంలోని మండ్యాకు చెందిన సోహన్ బలరాం అనే వ్యక్తి పేరు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సోహన్ బలరాం చాలా అదృష్టవంతుడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఫేస్ బుక్ లో పరిచయమైన స్నేహితుడిని కలవడానికి శనివారం కేరళకు వెళ్లిన సోహన్ బలరాం అక్కడ అతని స్నేహితులతో బాగా ఎంజాయ్ చేశాడు. ఆ తరువాత ఇంటికి తిరిగి వచ్చే సమయంలో సోహన్ బలరాం ను స్నేహితులు లాటరీ టికెట్ ను కొనుగోలు చేయమని సూచించారు.

    బలవంతంగానే లాటరీ టికెట్ ను కొనుగోలు చేసిన సోహన్ బలరాం కొన్ని లాటరీ టికెట్ ను కోటి రూపాయల బంపర్ ప్రైజ్ తగిలింది. కేరళలోని పుత్తనిథని నగరంలో సోహన్ లాటరీ టికెట్ ను కొనుగోలు చేసిన కొన్ని గంటల్లోనే కోటి రూపాయలు లాటరీ తగిలినట్టు వెల్లడైంది. లాటరీ తగిలిన విషయం తెలిసి సోహన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

    లాటరీ గెలుపొందటంతో ఎంతో ఆనందంగా ఉందని సోహన్ బలరాం వెల్లడించారు. సోహన్ బలరాం లాటరీ గెలిచిన విషయం తెలిసిన అతని కుటుంబ సభ్యులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ట్యాక్సులు పోగా సోహన్ బలరాం చేతికి 70 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉందని సమాచారం.