సినిమా పేరు: మై అటల్ హూన్
నిర్మాతలు: వినోద్ భన్సాలీ, సందీప్ సింగ్, కమలేష్ భన్సాలీ.
దర్శకుడు: రవి జాదవ్
కథ, స్క్రీన్ ప్లే,మాటలు: రిషి విర్మనీ, రవి జాదవ్
ఎడిటర్: బంటీ నాగీ
సంగీతం: సలీం_ సులేమాన్, పాయల్‌దేవ్, కైలాష్ ఖేర్, అమిత్ రాజ్.
నటీనటులు: పంకజ్ త్రిపాఠి, ప్రియుష్ మిశ్రా, దయాశంకర్ పాండే, ప్రమోద్ పాఠక్, రాజ సేవక్.
రన్ టైం: 137 నిమిషాలు
రేటింగ్: 3/5
అణువణువూ జాతీయవాదాన్ని పునికి పుచ్చుకున్న నేతగా దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి కి పేరుంది.. సౌమ్యుడిగా, వివాద రహితుడిగా ఆయన పేరు గడించారు. దేశ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేశారు. బ్రహ్మచారిగానే తన జీవితాన్ని ముగించారు. చరమాంకంలో అనే వ్యాధితో బాధపడ్డారు. చివరకు అదే వ్యాధితో కన్నుమూశారు. మొదటి దఫా కేవలం 16 రోజులు మాత్రమే ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. రెండు సంవత్సరాల వ్యవధి అనంతరం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు.. సంకీర్ణ ప్రభుత్వం లోనూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని పలు కీలక పథకాలకు శ్రీకారం చుట్టారు. స్వర్ణ చతుర్భుజి, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన వంటి పథకాలు అటల్ బిహారీ వాజ్ పేయి హయంలో ప్రవేశ పెట్టినవే. అదే అటువంటి అటల్ బిహారీ వాజ్ పేయి ప్రస్తుత తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో రవి జాదవ్ మై అటల్ హున్ అనే చిత్రాన్ని రూపొందించారు.
కథ: జర్నలిస్ట్ సారంగ్ దర్శన్ రాసిన అటల్ బిహారీ వాజ్ పేయి జీవిత చరిత్రపై రాసిన పుస్తకం ఆధారంగా రవి జాదవ్ ఈ సినిమాను రూపొందించారు. భారతదేశంలో మిత వాద రాజకీయాలు, దాని వెనుక ఉన్న అసలు కోణాన్ని ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించే ప్రయత్నాన్ని రవి జాదవ్ చేశారు. ఢిల్లీలోని యమునా నది ఒడ్డున పెరిగిన యువ వాజ్ పేయి కవిగా ఎలా మారాడు? అటువంటి వ్యక్తి భారతదేశపు ప్రత్యామ్నాయ రాజకీయ వేత్తగా ఎలా ఉద్భవించాడు? ఇద్దరు పార్లమెంటు సభ్యులు ఉన్న పార్టీని కేంద్రంలో అధికారంలోకి ఎలా తేగలిగాడు? పోక్రాన్ అణుపరీక్షలు, ఇందిరాగాంధీ పాలనపై విమర్శలు, వాజ్ పేయి జీవితంలో చూడని ఇంకా కొన్ని విషయాల సమాహారమే ఈ చిత్ర కథ.
సినిమా ఎలా ఉందంటే..
రవి యాదవ్ సారంగ్ దర్శన్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ముందుగానే చెప్పాడు. పంకజ్ త్రిపాఠి తో పాత్ర రూపొందించిన రవి జాదవ్.. మిగతా పాత్రలను అంతగా పట్టించుకోనట్లు కనిపిస్తుంది. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన వాజ్ పేయి ప్రపంచీకరణను ఎందుకు ఒక్కసారిగా ఇష్టపడ్డాడో చెకుడు చెప్పలేకపోయాడు.. అయితే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో వాజ్ పేయి ఉదారవాద ఆలోచనలు ఎలా ఆరోజు వ్యతిరేకత పొందాయో చెప్పడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు.. సినిమా ప్రారంభంలో ఢిల్లీలో పుట్టి.. యమునా నది తీరంలో ప్రభుత్వం రాసుకునే యువ వాజ్ పేయి పాత్రతో కథను మొదలు పెట్టిన దర్శకుడు.. వాజ్‌పేయి వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు చెప్పడానికి చాలా సమయం తీసుకున్నాడు.. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ రేడియోలో ప్రసంగిస్తుంటే ఒక వ్యక్తి వింటాడు. ఆయన ఏం చెప్తున్నాడు అని ఆ వ్యక్తిని వాజ్‌పేయ్ అడిగితే.. నాకేమీ అర్థం కాలేదు నీకేం చెప్పను అని బదులిస్తాడు. అంటే అప్పుడే దేశానికి సంబంధించి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ అవసరం వాజ్‌పేయి మదిలో పుట్టిందని దర్శకుడు ఆ సన్నివేశం ద్వారా చెప్పాడు. సారంగ్ దర్శన్ రాసిన పుస్తకంలో వివరాలను యధావిధిగా తీయకుండా దర్శకుడు కొంతమేర సినిమా టిక్ లిబర్టీ తీసుకున్నాడు అనిపిస్తుంది. వాజ్‌పేయి ఉదారవాద ప్రజాస్వామ్యవాది, హిందూత్వ భావజాలం ఉన్న వ్యక్తి అని పలు సన్నివేశాల్లో దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే గాంధీ గురించి వాజ్‌పేయి భావన ఏమిటో దర్శకుడు చెప్పలేకపోయాడు. వాజ్‌పేయి ప్రాణ స్నేహితుడు సికిందర్ భక్త్ తో స్నేహం ఎలా ఏర్పడింది? అతని రాజకీయ ప్రయాణంలో సికిందర్ పాత్ర ఏమిటి అనే విషయాలను దర్శకుడు చెప్పలేకపోయాడు. అయితే వాజ్‌పేయి జీవితంలో రెండు వివాదాస్పద అంశాలను మాత్రం దర్శకుడు ప్రస్తావించారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ఒక రోజు ముందు అక్కడి ఉపరితలాన్ని వాజ్‌పేయి శుభ్రం చేయడం, లక్నోలో చేసిన ప్రసంగం, ఆ తర్వాత మతపరమైన ఘర్షణలు చెలరేగి అల్లర్లు చోటు చేసుకోవడం, తర్వాత వాజ్‌పేయ్ పశ్చాత్తాపం వ్యక్తం చేయడం వంటి విషయాలను దర్శకుడు చాలా తెలివిగా చిత్రీకరించాడు. ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా చెప్పగలిగాడు. అయితే అందులోనూ వాజ్‌పేయి తప్పు ఏమీలేదనట్టుగా దర్శకుడు చూపించడం విశేషం. ఏక్తా కౌల్ రాజ్ కుమారి కి వాజ్‌పేయికి మధ్య ఉన్న బంధాన్ని దర్శకుడు బాగా చూపించాడు. అయితే వారిద్దరి మధ్య ఎందుకు సంఘర్షణ ఏర్పడిందో మాత్రం దర్శకుడు చూపించలేకపోయారు. బల్ రాజ్ మదోక్, దత్తో పంత్ తెంగడి వంటి జన సంఘ్, సంఘ్ పరివార్ లో వాజ్ పేయి ప్రత్యర్థుల గురించి దర్శకుడు ప్రస్తావించలేదు. రామాలయ ఉద్యమం గురించి వాజ్‌పేయి మాట్లాడినప్పుడు జరిగిన చర్చ, మండల్ కమిషన్ నివేదికపై వాజ్ పేయి నాడు మాట్లాడిన మాటలను కూడా దర్శకుడు ఎక్కడా ప్రస్తావించలేదు. వీరగాంధీ మీద వాజ్‌పేయి చేసిన విమర్శలు, రామ మందిరం ఎందుకు నిర్మించాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటే వాజ్‌పేయికి ఎందుకు ద్వేషం ఏర్పడింది? నాడు ఇందిరా గాంధీ హయాంలో జరిగిన అవకతవకలు పైనే దర్శకుడు సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో బిజెపి ప్రో కోణంలోనే దర్శకుడు ఈ సినిమాను రూపొందించినట్టు చూసే ప్రేక్షకుడికి అర్థమవుతుంది. పోఖ్రాన్ 11, కార్గిల్ యుద్ధం, లాహోర్ కు బస్సు ప్రయాణం, స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు వంటి అంశాలను దర్శకుడు ప్రముఖంగా ప్రస్తావించాడు. అయితే ఇంతటి సినిమాలో వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ మధ్య ఉన్న స్నేహాన్ని దర్శకుడు ఎక్కడా కూడా చూపించకపోవడం విశేషం.
ఎవరు ఎలా చేశారంటే
ప్రమోద్ మహాజన్, సుష్మా స్వరాజ్, ఏపీజే అబ్దుల్ కలాం పాత్రధారులు సో సో గా నటించారు. ఈ పాత్రలపై దర్శకుడు పెద్దగా దృష్టి సారించలేదని సినిమా చూసే సగటు ప్రేక్షకుడికి అర్థం అవుతూనే ఉంటుంది. వాజ్ పేయి పాత్రలో నటించిన పంకజ్ త్రిపాఠి జీవించారు అని చెప్పాలి. అక్కడను తప్ప ఆ పాత్రకు మరొకని ఊహించుకోలేం. రవి జాదవ్ ఈ సినిమాలో అక్కడక్కడ మెరుపులు మెరిపించినప్పటికీ తుది కంటా దాన్ని కొనసాగించలేకపోయారు. స్థూలంగా ఈ సినిమాని బీజేపీ కోణంలోని తీసారు కాబట్టి.. ఆ వర్గం వారికి ఈ సినిమా నచ్చొచ్చు..పైగా నాటి పరిస్థితులను తెలుసుకోవాలనే వారికి కూడా ఈ సినిమా మెప్పిస్తుంది.
బాటం లైన్: బీజేపీ కోణం లో అటల్ బయోపిక్
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Main atal hoon movie review in telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com