Pawan Kalyan On Mahesh Babu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న ‘వారాహి విజయ యాత్ర’ పర్యటన జనాలు బ్రహ్మరథం పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి విడతలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పర్యటన మొదలైంది. కత్తిపూడి సభతో ప్రారంభమైన ఈ వారాహి విజయ యాత్ర నేటితో రాజోలు కి చేరుకుంది.
ఈ రాజోలు సభతో తూర్పు గోదావరి మరియు కోనసీమ జిల్లాలలో పవన్ కళ్యాణ్ మొదటి విడత యాత్ర ముగిసింది. ఇప్పుడు ఆయన యాత్ర తదుపరి నర్సాపురం మరియు భీమవరం నియోజకవర్గాల్లో కొనసాగుతూ ముగుస్తుంది. మిగిలిన ఈ రెండు సభలలో పవన్ కళ్యాణ్ ప్రసంగాల కోసం అందరూ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇకపోతే నేడు ఆయన రాజోలు సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
పవన్ కళ్యాణ్ ఈమధ్య తన ప్రతీ సభలలో తన తోటి స్టార్ హీరోల పేర్లు ఎత్తుతూ మాట్లాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందువల్ల ఆయా హీరోల అభిమానుల సపోర్టు జనసేన పార్టీ కి ఈమధ్య బాగా పెరుగుతుంది. ఈ సభలో అందరి హీరోల పేర్లు తియ్యలేదు కానీ, అలా ఈమధ్య తాను ఎందుకు తన తోటి హీరోల పేర్లను తీసుకొస్తున్నాడో వివరణ ఇచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘ నేను ఇప్పుడు కొత్తగా ఓట్ల కోసం హీరోల పేర్లు చెప్పడం లేదు.నాకు మొదటి నుండి నా తోటి హీరోలంటే ఇష్టం. ఎందుకు అంటే వారు ఒక్కో సినిమా చేసి 600 మందికి పైగా ఉపాధి కల్పిస్తారు, GST కడతారు, సాయం చేస్తారు, అందుకే నాకు ఇష్టం, ఈరోజు సభకు వస్తుంటే దారిలో ఒక మహేష్ బాబు గారి అభిమాని వచ్చి నేను మహేష్ గారి అభిమాని, కానీ రాజకీయంగా మీకు అండగా ఉండి, ఓటేస్తాను అంటే చాలా ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.