Sarkaru Vaari Paata day 1 Collections: దాదాపు రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత.. కరోనా కల్లోలాన్ని అధిగమించి విడుదలైన చిత్రం ‘సర్కారువారి పాట’. మహేష్ బాబు నటించిన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది. ఏపీలో తుఫాన్ ప్రభావం.. నైజాంలో ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడం ఈ సినిమాకు ప్రతికూలంగా మారాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్ ఓ మోస్తారుగా సాగడంతో సర్కారువారి పాట తొలిరోజు కలెక్షన్లు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు షాకింగ్ గా ఉన్నాయి.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సర్కారువారి పాట తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ లతో బాగానే ఆర్ఝించింది. తొలి రోజున హైదరాబాద్ లో సర్కారువారి పాట 42 లక్షలు వసూలు చేసింది. గతంలో తొలిరోజు పుష్ప 41 లక్షలు, భీమ్లా నాయక్ 38 లక్షలు, ఆచార్య 37 లక్షలు సాధించాయి. తొలిరోజు హైదరాబాద్ లో ఆర్ఆర్ఆర్ అత్యధికంగా 60 లక్షలు వసూలు చేసి రికార్డు నమోదు చేసింది.
నైజాంలో మహేష్ బాబుకు కలెక్షన్లు రాలేదు. తుఫాన్ వల్ల ఇక ఆంధ్రాలో దెబ్బపడింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సర్కారువారి పాట 26-28 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టే అవకాశాలున్నాయి.
అమెరికాలో ప్రీమియర్లు, అడ్వాన్స్ బుకింగ్ లతో సర్కారువారి పాట 900000 డాలర్ల కలెక్షన్లు సాధించింది. తొలిరోజు కలెక్షన్లతో ఈ చిత్రం అమెరికాలో 1 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. మహేష్ బాబు కెరీర్ లో ఒక మిలియన్ డాలర్లు రాబట్టడం ఇది 11వ సారి కావడం విశేషం.
బెంగళూరు, చెన్నైలలో సర్కారువారి పాటకు స్పందన పెద్దగా లేదు. బెంగళూరులో 200కు పైగా షోలో ప్రదర్శించారు. సుమారు 50 శాతం అక్యుపెన్సీతో ఈ చిత్రం తొలిరోజు 91 లక్షలు వసూళ్లు సాధించింది. చెన్నైలో సుమారు 35 లక్షల షేర్ నమోదు చేసింది.
ఓవర్సీస్, ఇండియా, తెలుగు రాష్ట్రాలు,దక్షిణాది కలుపుకొని ఈ సినిమా వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ 36-38 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. ఇది నాన్ పాన్ ఇండియా మూవీస్ పరంగా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. అధికారికంగా ఈ కలెక్షన్లు వెల్లడించాల్సి ఉంది.
Recommended Videos