Mahesh Babu Krishna : ఇటీవల కాలం లో కోట్లాది మంది అభిమానులను మరియు సినీ ప్రముఖులను శోక సంద్రంలోకి నెట్టేసిన విషయం సూపర్ స్టార్ కృష్ణ మరణం..తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన మహానుభావుడు..డేరింగ్ & డాషింగ్ కి చిరునామా వంటి వ్యక్తి..అలాంటి మనిషిని మళ్ళీ మనం చూడలేం ఏమో..ఆయన లేని లోటు ఎవ్వరు పూడవలేనిది.. కానీ తండ్రికి తగ్గ తనయుడు అని అనేక సార్లు నిరూపించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్.కృష్ణ సీనియర్ ఫాన్స్ ఇక తమ అభిమాన హీరో ని మహేష్ బాబు లో చూసుకోవచ్చు..కృష్ణ బ్రతికున్నని రోజులు సూపర్ స్టార్ మహేష్ బాబు ని చూసి ఎంతో గర్వపడేవారు.

తన వారసత్వం ని సమర్థవతంగా ముందుకు సాగించడమే కాకుండా తన లెగసీ ని ప్రపంచం నలుమూలల విస్తరింపచేసిన మహేష్ బాబు అంటే కృష్ణ కి ఎంతో గర్వపడే విషయం..మహేష్ బాబు కూడా ఎన్నోసార్లు తన తండ్రి మీదున్న అభిమానం ని చాటుకుంటూ వచ్చాడు..తన తండ్రి నాకు దైవం తో సమానమని..ఆయన ఋణం నేను ఈ జన్మలో తీర్చుకోలేనని ఎన్నో ఇంటర్వూస్ లో మహేష్ బాబు ఎమోషనల్ గా చెప్పిన సందర్భాలు మనం చాలానే చూసాము.
తాను అంతలా ఆరాధించే తండ్రి చనిపోవడం మహేష్ బాబు కి ఎలాంటి బాధని కలిగించి ఉంటుందో ఊహించుకోవచ్చు..పైగా ఒకే ఏడాది లో అన్నయ్య, తల్లి, తండ్రి చనిపోవడం అనేది ఊహించడానికే భయానకంగా ఉంటుంది..ఇక అనుభవిస్తున్న మహేష్ బాబు పరిస్థితి ఎలా ఉంటుందో పాపం..అయితే తండ్రి చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారి మహేష్ బాబు పెట్టిన ఒక ఎమోషనల్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘మీ జీవితం ఎంత గొప్పగా సాగిందో.. మీ నిష్క్రమణ కూడా అంతే గొప్పగా సాగింది..ఇదంతా మీ మంచితనం తో సంపాదించుకున్న ఘనకీర్తి..మీ తుదిశ్వాస వరుకు నిర్భయంగా సింహాలగా బ్రతికారు..ధైర్య సాహసాలు మీకు ఊపిరి లాంటిది..నేను నింపుకున్న స్ఫూర్తి..నేను నమ్మిన దైవం అంతా మీతోనే పోయాయి..కానీ గతం తో పోలిస్తే నేను ఇప్పుడు ఎంతో ధైర్యం గా దృడంగా ఉన్నాను..ఇప్పుడు నాకు ఎటువంటి భయం లేదు..అది మీరు ఎప్పటికి ఎదో ఒక రూపం లో నాకు అండగా ఉంటారనే నమ్మకం కావొచ్చు..మీ పవిత్రమైన ఆశీసులు మరియు ప్రేమ ఎప్పటికి నాతోనే ఉంటాయి..ఎక్కడున్నా మీరు గర్వపడేలా మీరు నాకు ఇచ్చిన ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తా..లవ్ యు నాన్న’ అంటూ మహేష్ బాబు పెట్టిన ఎమోషనల్ పోస్ట్ తెగ వైరల్ గా మారిపోయింది.
— Mahesh Babu (@urstrulyMahesh) November 24, 2022