Pawan Kalyan : జనసేనకు మద్దతు పెరుగుతోంది. తాజాగా మహాసేన రాజేశ్ చేసిన వీడియో ఆసక్తి రేపింది. ఒక నిర్ణయం తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ సత్తెనపల్లిలో చేసిన ప్రసంగం విన్నతర్వాత జనసేనకే తన మద్దతు అని ప్రకటించారు. అసలు సత్తెన పల్లి ప్రసంగం సారాంశం ఒక్కటే.
ఇప్పటివరకు అధికారం దక్కని కులాలకు అధికారం.. బడుగు బలహీన వర్గాలకు సాధికారత.. ఇప్పటికే అధికారం అనుభవించిన కులాలకు అధికారానికి కొన్నాళ్లు విరామం. స్థూలంగా సామాజిక అంశాలను సృశిస్తూ జనసేనాని పవన్ చేసిన ప్రసంగం ఇదీ..
దీనికి మహాసేన రాజేశ్ ఫిదా అయిపోయి పవన్ కు మద్దతు పలికారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజేశ్ దళితుల వాయిస్ ను బలంగా వినిపించే గొంతుకగా పేరొందారు. మహాసేన వీడియోకు 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కరెంట్ ఎఫైర్స్ మీద రాజేశ్ వీడియోలు చేస్తుంటాడు. అంబేద్కర్ సిద్ధాంతాలు నమ్మి సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నారు.
2019 ఎన్నికల్లో పూర్తిగా వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్నారు. వైసీపీ ద్వారానే దళితులకు న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తి రాజేశ్. ఏ విధంగా దళితులకు జగన్ అన్యాయం చేస్తున్నాడని తెలుసుకొని వైసీపీకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నాడు.
దళిత గొంతుక మహసేన రాజేశ్ పవన్ కళ్యాణ్ కు మద్దతు వెనుక కారణాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..
