సాధారణంగా ప్రజలు సర్పంచ్ అంటే వాళ్లకు ఎక్కువ ఆదాయం ఉంటుందని భావిస్తారు. అయితే కాలం మారుతున్న కొద్దీ ఖర్చులు పెరుగుతున్నా చాలా మందికి ఆదాయం పెరగడం లేదు. ఫలితంగా వేల రూపాయలు జీతం వస్తున్నా సర్పంచ్ లు ఇతర వ్యాపారాలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండటంతో తాజాగా ఒక సర్పంచ్ కూరగాయలు అమ్ముతూ వార్తల్లో నిలిచారు.
Also Read: జుట్టు విరబోసుకుని పూజలు చేస్తున్నారా..?
వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా మహబూబాబాద్ జిల్లా రేగడి తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ గుగులోతు లక్ష్మీ రామచంద్రు జీవనోపాధి కోసం కూరగాయలు అమ్ముతున్నారు. తమ కుటుంబానికి ఉన్న భూమిలో ఆకుకూరలను పండిస్తున్న మహిళ ఆ ఆకుకూరలను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ లో అమ్ముతున్నారు. కూరగాయలను అమ్మడం గురించి సర్పంచ్ ను అడిగితే ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారా.. ఏ తప్పుకు ఎంత జరిమానా అంటే..?
కూరగాయలను ఎందుకు అమ్ముతున్నారని మహిళను అడిగితే తాను ఊరికి పెద్దనని.. ఊరికి పెద్ద అయినంత మాత్రాన ఉపాధికి ఢోకా ఉండకూడదని నిబంధన లేదు కదా..? అంటూ ఆమె రివర్స్ లో ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి వచ్చే వేతనం వాహనం పెట్రోల్ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని.. మన పని మనం చేసుకోవడంలో తప్పు ఏమిటని మహిళ ప్రశ్నించారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
సర్పంచ్ వేసిన ప్రశ్నలో కూడా నిజం లేకపోలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మహిళా సర్పంచ్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరి కొందరు ప్రజాప్రతినిధులు కూడా సొంతంగా వ్యవసాయ భూములను సాగు చేసుకుంటూ గతంలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.