https://oktelugu.com/

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారా.. ఏ తప్పుకు ఎంత జరిమానా అంటే..?

కరోనా మహమ్మారి విజృంభణ తరువాత దేశంలో వ్యక్తిగత వాహనాలను వినియోగించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. స్కూటర్, బైక్, కార్ లను కలిగి ఉన్న వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల గురించి కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. టాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేస్తే జరిమానా తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే వాహనం నడిపే సమయంలో ఏ తప్పు చేస్తే ఎంత జరిమానా విధిస్తారో అవగాహన కలిగి ఉంటే మంచిది. Also Read: ఆ ఊరిలో ఆకుకూరలు అమ్ముతున్న […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 5, 2021 / 12:35 PM IST
    Follow us on

    కరోనా మహమ్మారి విజృంభణ తరువాత దేశంలో వ్యక్తిగత వాహనాలను వినియోగించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. స్కూటర్, బైక్, కార్ లను కలిగి ఉన్న వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల గురించి కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. టాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేస్తే జరిమానా తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే వాహనం నడిపే సమయంలో ఏ తప్పు చేస్తే ఎంత జరిమానా విధిస్తారో అవగాహన కలిగి ఉంటే మంచిది.

    Also Read: ఆ ఊరిలో ఆకుకూరలు అమ్ముతున్న సర్పంచ్.. ఎందుకంటే..?

    తల్లిదండ్రులు డ్రైవింగ్ రాని పిల్లలకు వాహనం ఇచ్చి రోడ్డు ప్రమాదం జరిగితే వాహనం రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ కావడంతో పాటు వాహనం ఇచ్చిన వ్యక్తి జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. నడిపే వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోతే 2 వేల రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే మూడు నెలలు లైసెన్స్ రద్దయ్యే అవకాశంతో పాటు 1,000 రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

    Also Read: జుట్టు విరబోసుకుని పూజలు చేస్తున్నారా..?

    వాహనంలో ప్రయాణించే సమయంలో ఆంబులెన్స్ కు దారి ఇవ్వకపోతే 10,000 రూపాయలు, బైక్ పై ఇద్దరు లేదా ఎక్కువమంది వెళితే మూడు నెలలు లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు రూ.2 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కారులో సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే 1000 రూపాయలు, ప్యాసింజర్ వెహికల్స్ లో ఓవర్ లోడ్ అయితే అదనంగా ఉన్న ఒక్కొక్కరికి 1,000 రూపాయలు, కమర్షియల్ వెహికల్స్ ఓవర్ లోడింగ్‌ కు 2 వేల రూపాయల నుంచి 20 వేల రూపాయల వరకు జరిమానా ఉంటుంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    లైసెన్స్ నిబంధనలు బ్రేక్ చేస్తే రూ.25 వేల నుంచి రూ.లక్ష, పర్మిట్ లేకుండా వాహనం నడిపితే రూ.10 వేలు, రేసింగ్ లలో పాల్గొంటే 5 వేల రూపాయలు, మద్యం తాగి నడిపితే రూ.10 వేలు, ఓవర్ స్పీడ్‌ తో వాహనం నడిపితే 2 వేల రూపాయలు, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 5 వేల రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.