https://oktelugu.com/

Udhayanidhi Stalin : ఉదయనిధి స్టాలిన్ పై కేసు పెట్టనందుకు పోలీసుల్ని తప్పుపట్టిన మద్రాస్ హైకోర్టు

ఉదయనిధి స్టాలిన్ పై కేసు పెట్టనందుకు పోలీసుల్ని తప్పుపట్టిన మద్రాస్ హైకోర్టు.. ఈ వివాదంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2023 / 05:38 PM IST

    Udhayanidhi Stalin : ఉదయనిధి స్టాలిన్ పై ఎందుకు కేసులు నమోదు చేయలేదని పోలీసులకు మద్రాస్ హైకోర్టు అక్షింతలు వేసింది. ఎందుకంటే సెప్టెంబర్ 2వ తేదీన ఉదయనిధి స్టాలిన్ ఓ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశం పేరే ‘సనాతన ధర్మం నిర్మూలన’.. కాబట్టి ఆ సమావేశాన్ని కమ్యూనిస్టులకు సంబంధించిన ‘తమిళనాడు అభ్యుదయ రచయితల సంఘం’ నిర్వహించింది.

    ఈ సమావేశంలో ఉదయనిధి ఇచ్చిన సందేశం పెనుదుమారం రేపింది. ఇది డెంగ్యూ కన్నా.. మలేరియా కన్నా.. కోవిడ్ కన్నా అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించాడు. దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. ఇక ఇండియా కూటమిలోని పార్టీలన్నీ దీనిపై స్పందించడానికి భయపడ్డాయి. దీనిపై డీఎంకేపై, స్టాలిన్ పై పెను విమర్శలు వచ్చాయి.

    ఈ వివాదం అంతా చల్లబడిన వేళ మద్రాస్ హైకోర్టు తాజాగా స్టాలిన్ పై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించింది. మాద్రాస్ హైకోర్టు స్పందించడానికి కారణం సుప్రీంకోర్టు వ్యాఖ్యలే.. మతం మీద వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు కేసు పెట్టడం లేదని హైకోర్టు నిలదీసింది.

    ఉదయనిధి స్టాలిన్ మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. నేను అలానే మాట్లాడుతానని అన్నాడు. దీంతో హైకోర్టు సీరియస్ అయ్యి కేసులు పెట్టాలని ఆదేశించింది.

    ఉదయనిధి స్టాలిన్ పై కేసు పెట్టనందుకు పోలీసుల్ని తప్పుపట్టిన మద్రాస్ హైకోర్టు.. ఈ వివాదంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.