https://oktelugu.com/

Madhya Pradesh: అంతా ఎలుకలే చేశాయి.. కేసు పెట్టిన పోలీసులు.. కారణం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు

మధ్యప్రదేశ్‌లోని చింద్వారా పోలీస్‌ స్టేషన్‌లోని ’మల్ఖానా’ (స్టోర్‌రూమ్‌)లో సాక్ష్యంగా ఉంచిన 60 దేశీ మద్యం బాటిళ్లను ఎలుకలు ‘పాడు‘ చేశాయని స్థానిక పోలీసులు కోర్టులో నివేదిక సమర్పించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 8, 2023 2:17 pm
    Madhya Pradesh

    Madhya Pradesh

    Follow us on

    Madhya Pradesh: శీర్షిక చదవగానే ఎక్కడో తేడా అనిపించింది కదూ.. కానీ మీరు చదివించి సరైందే.. మధ్యప్రదేశ్‌ పోలీసులకు ఎలుకలపై కేసు నమోదు చేసిన ఘనత దక్కింది. అయితే ఎందుకు కేసు పెట్టారా అని ఆలోచిస్తున్నారా.. ఏమీ లేదు.. వారు పట్టుకున్న 60 విదేశీ మద్యం బాటిళ్లను తాగేశాయట. అతిగా మద్యం తాగి వాహనాలు నడిపితే అరెస్ట్‌ చేయడం చూశాం.. కానీ మధ్యప్రదేశ్‌ ఎలుకలు ఎంత పనిచేశాయంటే.. నిల్వ ఉంచిన మద్యం ఖాళీ చేశాయి. కేసు పెట్టిన వాటితోపాటు మరికొన్ని ఎలుకల ప్రమేయం కూడా ఉందని విచారణ చేస్తున్నారు కూడా. చింద్వారా స్టేషన్‌లోని పోలీసులు ఈ విచిత్ర అరెస్ట్‌ చేశారు. అక్రమ మద్యం కేసు ఒకటి కోర్టులో విచారణలో ఉండటంతో ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచారు. సీజ్‌ చేసిన అరవైకి అరవై బాటిళ్లన్నీ ఖాళీ అవ్వడంతో ఎలుకలే తాగేశాయనే ఆరోపణలతో పోలీసు బాబులు కేసు నమోదు చేశారు. ఈమేరకు కోర్టుకు కూడా నివేదిక సమర్పించడం గమనార్హం.

    తాగుబోతు ఎలుకలు..
    మధ్యప్రదేశ్‌లోని చింద్వారా పోలీస్‌ స్టేషన్‌లోని ’మల్ఖానా’ (స్టోర్‌రూమ్‌)లో సాక్ష్యంగా ఉంచిన 60 దేశీ మద్యం బాటిళ్లను ఎలుకలు ‘పాడు‘ చేశాయని స్థానిక పోలీసులు కోర్టులో నివేదిక సమర్పించారు. విచిత్రమేమిటంటే, గదిలోని ఇతర వస్తువులు ఏవీ పాడవలేదు. కానీ ఒక్కొక్కటి 180 ఎంఎల్‌ మద్యం ఉన్న ఈ బాటిళ్లను మాత్రం తాగేశాయి. వీటిని కోర్టులో సాక్షంగా సమర్పించాల్సి ఉంది.

    ప్లాస్టిక్‌ బాటిళ్లు కావడంతోనేనట..
    మద్యం తయారు చేసిన కంపెనీ వాటిని ప్లాస్టిక్‌ బాటిళ్లలో పోసి విక్రయిస్తోందట. ఆ కారణంగానే ఎలుకలు వాటిని కొరికి మద్యం తాగేశాయని కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఇందులో పోలీసుల తప్పు ఏమీ లేదని, మద్యం తయారు చేసిన కంపెనీ, బాటిళ్లను కొరికిన ఎలుకలదే తప్పంత అని పంచనామా నివేదికలో తెలిపారు.

    కోర్టు ఆమోదించిందా..?
    అయితే పోలీసుల నివేదికను కోర్టు ఆమోదించిందా అని సదరు పోలీసు స్టేషన్‌ ఇన్‌చార్జిని అడగగా, ‘సాధారణంగా, కోర్టు నిజమైన సమస్యలను పరిగణిస్తుంది. ఖాళీ సీసాలు వంటి సాక్ష్యాలు ఉన్నాయి. మా పోలీస్‌ స్టేషన్‌ పాత భవనంలో ఉంది. ఎలుకల బెడద ఉంది. మేము వాటిని ట్రాప్‌ చేయడానికి, వాటిని వేరే చోట విడిచిపెట్టడానికి చర్యలు తీసుకుంటాము. ఈ కేసు తర్వాత కూడా మేము ఎలుకలను పట్టుకుని తరలిస్తాం’ అని తెలిపాడు.