Maa Elections:మా ఎన్నికల పోలింగ్ ఎట్టకేలకు ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఓట్లు పోలయ్యాయి. అయితే ఈ ఎన్నికల్లో మొట్టమొదటి ఓటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేయగా.. ఆ తర్వాత చిరంజీవి, రాంచరణ్, బాలక్రిష్ణ, నరేశ్, సాయికుమార్, శివాజీరాజా, సుడిగాలి సుధీర్ సహా సినీ ప్రముఖులు అంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిట్టచివరన హడావుడిగా యాంకర్ అనసూయ వేటు వేయడం కనిపించింది.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు మా పోలింగ్ కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాలను కూడా ఇదే రోజు రాత్రి ప్రకటిస్తారు. రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
-‘మా’ చరిత్రలోనే అత్యధిక పోలింగ్
‘మా’ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ‘మా’ చరిత్రలోనే అత్యధిక పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 626 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 925 మంది ‘మా’ సభ్యులు ఉండగా.. అందులో 883 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం క్యూలైన్ లో ఉన్న వారికి కూడా ఓటు హక్కు కల్పించారు.
-‘మా’ ఎన్నికల్లో ఓటు వేయని స్టార్ హీరోలు, హీరోయిన్లు వీరే
‘మా’ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో ఓట్లు పోలయ్యాయి. అయితే పలువురు హీరో హీరోయిన్లు మా ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఇందులో స్టార్ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్, రానా, అల్లు అర్జున్, ఎన్టీఆర్, వెంకటేశ్ , నితిన్, నాగచైతన్య తోపాటు హీరోయిన్లు రకుల్, ఇలియానా, త్రిష, హన్సిక, పూజా హెగ్డేలు ఓటు వేయలేదు.
-72శాతం పోలింగ్ నమోదు..
‘మా’ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 626 మంది ఓటు వేశారు. 72శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.
-మురళీ మోహన్, మోహన్ బాబు సమక్షంలో కౌంటింగ్
పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రంలోకి తరలించారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ ను తప్ప అందరినీ బయటకు పంపారు. ఎన్నికల కౌంటింగ్ ను ప్రారంభించారు. ఈ సాయంత్రం వరకూ విజేతలు ఎవరో తెలియనుంది.