https://oktelugu.com/

గ్యాస్ సిలిండర్ వాడేవాళ్లకు శుభవార్త.. ఎక్కడైనా తీసుకునే ఛాన్స్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లకు ప్రయోజనం చేకూరేలా మరో కీలక నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్ యూజర్లకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుందని సమాచారం అందుతోంది. ఈ నిబంధనలు అమలులోకి వస్తే రాబోయే రోజుల్లో ఏ గ్యాస్ డీలర్ నుంచైనా గ్యాస్ సిలిండర్ ను తీసుకోవచ్చు. సిలిండర్ల కొరత ఉన్న సమయంలో ఈ నిర్ణయం వల్ల గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఫాస్ట్ గా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 3, 2021 / 07:51 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లకు ప్రయోజనం చేకూరేలా మరో కీలక నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్ యూజర్లకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుందని సమాచారం అందుతోంది. ఈ నిబంధనలు అమలులోకి వస్తే రాబోయే రోజుల్లో ఏ గ్యాస్ డీలర్ నుంచైనా గ్యాస్ సిలిండర్ ను తీసుకోవచ్చు.

    సిలిండర్ల కొరత ఉన్న సమయంలో ఈ నిర్ణయం వల్ల గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఫాస్ట్ గా ఎవరైతే గ్యాస్ సిలిండర్ ను అందిస్తారో వారి నుంచే సిలిండర్ తీసుకోవడానికి వినియోగదారులు ఆసక్తి చూపుతారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ఒక సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం. గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్న సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఇది శుభవార్తే అని చెప్పాలి.

    కేంద్రం కొత్త నిబంధనలను అమలులోకి తెస్తే ఇండేన్, భారత్, హెచ్‌పీ ఇలా ఏ కంపెనీ డీలర్ నుంచైనా గ్యాస్ సిలిండర్ ను పొందవచ్చు. మోదీ సర్కార్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ రూల్స్‌ సవరణ దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. కొత్త కనెక్షన్ తీసుకోవాలని భావించే వాళ్లకు కూడా కేంద్రం శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇకపై అడ్రస్ ప్రూఫ్ అవసరం లేకుండానే కొత్త గ్యాస్ కనెక్షన్ ను తీసుకునే అవకాశం ఉంటుంది.

    కేంద్రం ఈ మేరకు నిబంధనలలో మార్పులు చేయనుందని ప్రచారం జరుగుతోంది. అయితే కొత్త నిబంధనలను కేంద్రం ఎప్పటినుంచి అమలులోకి తీసుకొస్తుందో తెలియాల్సి ఉంది.