https://oktelugu.com/

అరణ్య ట్రైలర్ టాక్: ఏనుగుల కోసం రానా పోరు

విలక్షణ నటుడు ‘రానా’ మరో విభిన్నమైన చిత్రంతో మనముందుకు వచ్చారు.తాజాగా ఆయన హీరోగా రూపొందిన ‘అరణ్య’ మూవీని ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కింది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు గ్రహీత ప్రభు సాల్మాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ […]

Written By: , Updated On : March 3, 2021 / 07:55 PM IST
Follow us on

విలక్షణ నటుడు ‘రానా’ మరో విభిన్నమైన చిత్రంతో మనముందుకు వచ్చారు.తాజాగా ఆయన హీరోగా రూపొందిన ‘అరణ్య’ మూవీని ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కింది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు గ్రహీత ప్రభు సాల్మాన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో 2021లో మొదటి త్రిభాష చిత్రంగా వస్తున్న ‘అరణ్య’ థియేట్రికల్ ట్రైలర్ ను నేడు ‘వరల్డ్ వైల్డ్ లైఫ్ డే’ సందర్భంగా చిత్రం యూనిట్ విడుదల చేసింది.

అడవిలో కొత్త ప్రాజెక్టులతో ఏనుగులకు శరాఘాతంగా మారిన పరిస్థితులను హీరో రానా ఛేధించడం.. కార్పొరేట్లను ఎదురించడం మెయిన్ థీమ్ గా ఉందని ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. రానా మేనరిజం మరియు ఆయన హావభావాలు నడక చాలా కొత్తగా ఉన్నాయి. క్యారెక్టర్ చేసినట్లు తెలుస్తోంది.

Aranya - Official Trailer | Rana Daggubati, Vishnu Vishal,  Prabu Solomon, Zoya & Shriya