Ranbir Kapoor Alia Bhatt:రణబీర్ కపూర్.. హిందీలో నేటి తరం నెంబర్ వన్ హీరో, అలియా భట్.. నెంబర్ వన్ హీరోయిన్. ఫుల్ డిమాండ్ తో టాప్ పొజిషన్ లో ఉన్న ఈ జంట.. ఏప్రిల్ 14న వివాహంతో ఒక్కటి అయ్యారు. రణబీర్ కపూర్ ఒక్కో సినిమాకు గానూ దాదాపు 60 కోట్లు తీసుకుంటాడు. అలియా భట్ ఒక్కో సినిమాకి 6 నుంచి 8.5 కోట్లు డిమాండ్ చేస్తోంది.

పైగా బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్న క్రేజీ స్టార్స్ లో ఈ ఇద్దరూ బాగా పేరొందిన సూపర్ స్టార్స్. మొత్తమ్మీద ఆ రకంగానూ బాగా సంపాదిస్తున్నారు. ఒక్కో యాడ్ కి రణబీర్ కపూర్ 9 కోట్లు తీసుకుంటున్నాడు. అలియా ఒక్కో యాడ్ కి 2 కోట్లు తీసుకుంటుంది. ఈ స్థాయిలో సంపాదిస్తున్న కపుల్స్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ప్రస్తుతం మరొకరు లేరు.
సంపాదన పరంగా ఈ జంట కొత్త రికార్డును క్రియేట్ చేసింది. అయితే, సినిమాల పరంగా సంపాదించే దానిలో రణబీర్ దే పైచేయి. కానీ.. ఆస్తుల పరంగా లెక్కలు వేసుకుంటే మాత్రం.. అలియానే ఎక్కువ సంపాదిస్తోంది. అలియా భట్ కి ముంబైలో, లండన్ లో చాలా ఆస్తులున్నాయి. అవన్నీ లెక్క వేసి వచ్చే ఆదాయాన్ని బట్టి.. అలియా నెట్ వర్త్ దాదాపు 550 కోట్లు ఉంటుంది.
మరి రణబీర్ కపూర్ నెట్ వర్త్ ఎంతో తెలుసా ? 330 కోట్లు. ఆలియా కంటే 320 కోట్లు తక్కువ. బాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రణబీర్ కపూర్, అలియా భట్ ను పెళ్లి చేసుకోవడానికి ఆమె నెట్ వర్త్ కూడా ప్రధాన కారణం అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో అరడజనుకు పైగా హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన రణబీర్.. అలియా దగ్గర ఆగడానికి కారణం.. అలియా ఆస్తులే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా ఇప్పుడు వీరిద్దరికీ కలిపి 880 కోట్లు నెట్ వర్త్ ఉంది. అందుకే.. ఈ జంట ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక నెట్ వర్త్ ఉన్న జంటల్లో ఒకరిగా నిలిచారు. పైగా ఇద్దరికీ లాంగ్ కెరీర్ ఉంటుంది. ఎలాగూ పెళ్లి తర్వాత కూడా అలియా తనకు వరుస సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంది. కాబట్టి.. ఇప్పట్లో ఆమె సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా లేదు. సో.. అత్యధిక నెట్ వర్త్ ఉన్న క్రేజీ కపుల్స్ లో ఫస్ట్ ప్లేస్ చాలా కాలం పాటు వీళ్ళ పేరు మీదే ఉండబోతుంది.
Also Read: yash: కేజీఎఫ్-2 కి యష్ ఇంత తక్కువ తీసుకున్నాడా.. తెలుగు హీరోలు ఎన్నడు మారుతారో..?
[…] Also Read: Ranbir Kapoor Alia Bhatt:అరడజను మందిని ప్రేమించి అలి… […]