Cross-Border love : సరిహద్దులు దాటుతున్న ప్రేమలు…

ఇలా ఫేస్ బుక్, ఇన్స్‌స్టాగ్రామ్, పబ్‌జీ లాంటి వాటిలో పరిచయం పెంచుకుని.. తమ ప్రియుడు లేదా ప్రియురాలి కోసం దేశాలు దాటి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Written By: NARESH, Updated On : July 30, 2023 4:04 pm
Follow us on

Love couples : అమెరికా అమ్మాయి-ఇండియా అబ్బాయి.. జర్మనీ అమ్మాయి-కరీంనగర్ అబ్బాయి.. భూటాన్ అమ్మాయి-ఖమ్మం అబ్బాయి.. ఇలా ఒకరిని ఒకరు ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం వాటి సంబంధించిన వార్తలు పత్రికలు టీవీల్లో రావడం తరచూ గమనిస్తున్నాం. అయితే వీరంతా జీవితంలో సెటిల్ అయ్యాక చట్టాలు.. నిబంధనల ప్రకారం పెళ్లి చేసుకున్న వారే. కానీ ఇటీవల కాలంలో కొన్ని ప్రేమలు ప్రేమికులను దేశ సరిహద్దులు దాటిస్తున్నాయి.. దేశ విడిచి విదేశాలకు పయనించేలా చేస్తుంది. ఆయన వారిని వదులుకొని.. మాతృభూమిని కాదనుకుని.. ప్రేమించిన వారి కోసం పరాయి దేశాలకు వెళ్తున్నారు.

– సోషల్ మీడియా ప్రేమలు..
వెనకటికి పెళ్లి సంబంధాలు అంటే అమ్మాయి అబ్బాయి చూసుకునే వారు కాదట. పెద్దలు కూర్చిన అమ్మాయిని లేదా అబ్బాయిని పెళ్లి చేసుకునే వారట. నేటి ప్రేమలు కూడా ఒకరిని ఒకరు చూసుకోకుండానే మొదలవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రేమలు చిగురిస్తున్నాయి. ఇలాంటి ప్రేమలో చాలావరకు దొంగ ప్రేమలే. కానీ ఇటీవల కొన్ని ప్రేమలు పెళ్ళి వరకు వెళుతున్నాయి. ప్రేమించిన వారికోసం దేశం విడిచి వెళ్లిపోయేలా చేస్తున్నాయి.

భారత్ కు వచ్చిన శ్రీలంక యువతి

భారత్ కు వచ్చిన శ్రీలంక యువతి.
సరిహద్దుల్లో ఇలా ప్రేమ చిగురించిన పెళ్లి చూస్తే  ఇటీవల శ్రీలంక యువతి శివకుమారి విఘ్నేశ్వరి 25 ఏళ్ల తన ఫేస్‌బుక్‌ స్నేహితుడైన లక్ష్మణ్‌ (28)ను పెళ్లాడేందుకు భారత్‌కు వచ్చింది. టూరిస్ట్ వీసాపై వచ్చిన యువతి పెళ్లి చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ వ్యక్తి. పెళ్లి వార్త శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆగస్టు 15న ముగిసేలోపు ఆమె దేశం విడిచి వెళ్లాలి. మరి వీరి పెళ్లి ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.  చిత్తూరు జిల్లా వి.కోట మండలం అరిమాకులపల్లెకు చెందిన తాపీ మేస్త్రీ లక్ష్మణ్‌కు 2017లో శ్రీలంకకు చెందిన విఘ్నేశ్వరి ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. విఘ్నేశ్వరి టూరిస్ట్ వీసాపై కొలంబో నుంచి జూలై 8న చెన్నైకి చేరుకుంది. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి లక్ష్మణ్ చెన్నై వెళ్లాడు. అనంతరం ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. లక్ష్మణ్ కుటుంబ సభ్యుల అంగీకారంతో జూలై 20న పెళ్లి చేసుకున్నారు. విఘ్నేశ్వరి భారత పౌరసత్వం పొందాలని యోచిస్తోంది. ఈ విషయం ఆనోట ఈ నోట పోలీసులకు చేరింది. దీంతో వారు యువతని పిలిపించి మాట్లాడారు. టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చిన విఘ్నేశ్వరీ వీసా గడువు ఆగస్టు 15 తో ముగుస్తుందని తెలిపారు. అప్పటిలోగా దేశం విడిచి వెళ్లాలని లేదంటే గడువు పొడిగించుకోవాలని సూచించారు. కానీ విఘ్నేశ్వరి తన దేశానికి తిరిగి వెళ్లడానికి నిరాకరించింది. తన భర్తతో కలిసి జీవించడానికి ఆమె శాశ్వతంగా దేశంలో ఉండటానికి ఏర్పాట్లు చేయాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈక్రమంలో వీసాను ఏడాది పాటు పొడిగింపు కోసం దరఖాస్తు చేసింది.

మొన్న పాకిస్థాన్ యువతి..
పబ్‌జీ’ గేమ్‌ ద్వారా పరిచయమైన భారత కుర్రాడితో ప్రేమలో పడి సరిహద్దులు దాటి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్. ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. వీసా లేకుండా అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించిన ఆమెను ఈ నెల 4న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన సచిన్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఇటీవల బెయిల్ పై విడుదలయ్యారు. ఇప్పుడు తాను కూడా భారతీయురాలినేనని చెప్పింది. ‘‘మా ఆయన హిందువు. కాబట్టి నేను కూడా హిందువునే. నాది ఇప్పుడు ఇండియానే” అని చెప్పుకొచ్చింది. పెండ్లి అయ్యి, నలుగురు పిల్లలున్న ఆమె.. నేపాల్ మీదుగా గ్రేటర్ నోయిడాలోని ప్రియుడు సచిన్ మీనా వద్దకు చేరుకుంది. గత మార్చిలోనే నేపాల్‌లో సచిన్, సీమా పెండ్లి చేసుకున్నారు. మరోవైపు దేశంలో అధికారికంగా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆమె భావిస్తోంది.

పాకిస్తాన్ కు వెళ్లి ప్రియుడిని కలిసిన భారత యువతి

పాకిస్తాన్ వెళ్లిన భారత యువతి..
ఈసారి. భారత్ నుంచే ఓ మహిళ తన ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లింది. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని భివాడీ ప్రాంతంలో అంజూ, అర్వింద్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి 15 ఏళ్ల కూతురు అలాగే ఆరేళ్ల కొడుకు ఉన్నారు. అయితే అంజు(34) కు కొన్ని నెలల క్రితం ఫెస్‌బుక్‌లో పాకిస్థాన్‌కు చెందిన నస్రుల్లా అనే 29 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడు మాట్లాడుకోవడం, చాటింగ్ చేసుకోవడంతో ఆ పరిచయం ప్రేమగా మారింది. నస్రుల్లా పాకిస్థాన్‌లో ఔషధ రంగంలో పనిచేస్తున్నాడు. అయితే అంజు ఎలాగైనా అతడ్ని కలుసుకోవాలనుకుంది. ఇందుకోసం వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైధర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో ఉన్న అప్పర్‌దిర్ జిల్లాకు వెళ్లింది. కానీ అక్కడి పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అంజు మాత్రం వీసాతో పాటు కావాల్సిన పత్రాలన్ని చూపించింది. దీంతో పోలీసులు ఆమెను విడిచిపెట్టారు.

పోలాండ్ నుంచి జార్ఖండ్ కు..
ఇదిలా ఉండగా ఇటీవల పోలాండ్‌కు చెందిన ఓ మహిళకు కూడా జార్ఖండ్‌కు చెందిన యువకుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో అప్పుటికే ఆరేళ్ల కుమార్తె ఉన్న పోలాండ్ మహిళ అతడ్ని పెళ్లి చేసుకునేందుకు జార్ఖండ్ వచ్చేసింది.

ఇలా ఫేస్ బుక్, ఇన్స్‌స్టాగ్రామ్, పబ్‌జీ లాంటి వాటిలో పరిచయం పెంచుకుని.. తమ ప్రియుడు లేదా ప్రియురాలి కోసం దేశాలు దాటి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.