Love couple overaction : మీ ప్రేమ పాడుగాను.. ఇలాగేనా చూపించేది?

ప్రేమ మత్తులో యువతీ యువకులకు ఏం చేస్తున్నామో కూడా సోయిలేనంతగా బైక్ పై ప్రేమ ప్రయోగాలు చేస్తున్నారు. సోషల్ మీడియా మత్తులో పడి బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు.

Written By: NARESH, Updated On : August 19, 2023 2:30 pm
Follow us on

Love couple overaction : ప్రేమ లోకంలో ఏం చేస్తున్నా కూడా యువతీ యువకులకు తెలియడం లేదు. లవ్ లో ఉన్నామనగానే గులాబీ సినిమాలో హీరో హీరోయిన్లలో బైక్ ఎక్కేసి విహరిస్తున్నారు. బైక్ పైనే స్టంట్స్ చేస్తున్నారు. అది కాస్తా స్లిప్ అయ్యిందనుకో ఇక ఏరుకోవడానికి ఎముకలు తప్ప బాడీలు కనిపించవు.

ప్రేమ మత్తులో యువతీ యువకులకు ఏం చేస్తున్నామో కూడా సోయిలేనంతగా బైక్ పై ప్రేమ ప్రయోగాలు చేస్తున్నారు. సోషల్ మీడియా మత్తులో పడి బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు.

సోషల్ మీడియా వచ్చాక లైక్ లు, కామెంట్ల కోసం ప్రమాదకర స్టంట్స్ ను ప్రేమికులు చూస్తున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించడం లేదు. సోషల్ మీడియా లో పాపులారిటీ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుటుంబున్నారు.

తాజాగా ఓ ఇద్దరు ప్రేమికులు బైక్ సాహసం చేసేశారు. లవ్ సింబల్ చూపిస్తూ బైక్ ను లేపారు. అయితే కంట్రోల్ తప్పి పోయి బైక్ వెనుకకు జారి ఇద్దరు ప్రేమికులు కింద పడిపోయారు. అదృష్టం ఏంటంటే బండి వీరి మీద పడకుండా కాస్త దూరం జరిగింది. లేకుంటే వీరిద్దరి ప్రాణాలు పోయేవి. ఇలాంటి స్టంట్స్ చేయవద్దని.. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను మనో వేదనకు గురిచేయకండని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా ఆ వీడియోను షేర్ చేస్తూ హితవు పలికారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.