https://oktelugu.com/

ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే అంతే సంగతులు..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు కీలక సూచనలు చేసింది. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు అకౌంట్ ను ఆధార్ తో లింక్ చేయించుకోవాలని సూచనలు చేసింది. అకౌంట్ కు ఆధార్ నంబర్ ను లింక్ చేసుకోకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. స్టేట్ బ్యాంక్ లో బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ సీడింగ్ ను చేయించుకోవాల్సిందేనని తెలిపింది. ఎవరైతే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 18, 2021 / 06:12 PM IST
    Follow us on

    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు కీలక సూచనలు చేసింది. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు అకౌంట్ ను ఆధార్ తో లింక్ చేయించుకోవాలని సూచనలు చేసింది. అకౌంట్ కు ఆధార్ నంబర్ ను లింక్ చేసుకోకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. స్టేట్ బ్యాంక్ లో బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ సీడింగ్ ను చేయించుకోవాల్సిందేనని తెలిపింది.

    ఎవరైతే బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ నంబర్ ను లింక్ చేయించుకుంటారో వాళ్లు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందగలరని ఎస్బీఐ పేర్కొంది. బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అయి ఉంటే సబ్సిడీకి సంబంధించిన నగదు వెంటనే బ్యాంక్ ఖాతాలో జమవుతుందని ఎస్బీఐ తెలిపింది. ఆధార్ నంబర్ లింక్ చేసుకోని వాళ్లు నగదు లావాదేవీలు నిర్వహించడం కూడా కష్టమవుతుందని ఎస్బీఐ పేర్కొంది.

    ఎస్బీఐ ఆన్ లైన్ ద్వారా, బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఆధార్ ను లింక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. 4 ఆప్షన్ల ద్వారా ఎస్బీఐ ఆధార్ నంబర్ ను లింక్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉండటం గమనార్హం. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, బ్యాంక్ బ్రాంచ్‌, ఎస్బీఐ యాప్ సహాయంతో ఎస్బీఐ ఖాతాకు ఆధార్ నంబర్ ను సులభంగా లింక్ చేయవచ్చు. బ్రాంక్ బ్రాంచ్ ద్వారా ఆధార్ లింక్ చేసుకోవాలంటే ఆధార్ జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ తీసుకొని బ్రాంక్ బ్రాంచ్ కు వెళ్లాలి.

    ఎస్బీఐ ఇంటెర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆధార్ లింక్ చేయించుకోవాలని భావించే వాళ్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో లాగిన్ అయ్యి బ్యాంక్ ఖాతాకు ఆధార్ ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.