Swaminathan : భారతరత్న స్వామినాధన్ హరిత విప్లవ సారధిగా గౌరవిద్దాం, కానీ ఆర్థికవేత్తగా కాదు

భారతరత్న స్వామినాధన్ హరిత విప్లవ సారధిగా గౌరవిద్దాం, కానీ ఆర్థికవేత్తగా కాదు’ స్వామినాథన్ సూచనలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : February 16, 2024 5:57 pm

Swaminathan : గత మూడు రోజుల నుంచి ఎంఎస్ స్వామినాథన్ సూచనల మీదనే చర్చ జరుగుతోంది. ఎంఎస్ స్వామినాతన్ భారత మాత ముద్దుబిడ్డ. ఇవ్వాళ భారత్ ఆహార ధాన్యాల్లో స్వయం సంవృద్ధి సాధించిందంటే దానికి కారణం స్వామినాథన్ నే. భారత్ రత్నకు అత్యంత అర్హుడు ఈయన.. వ్యవసాయంలోని సమస్యలను ఎత్తిచూపడంలో కూడా స్వామినాథన్ చాలా బాగా పనిచేశారు. ఎందుకో ఆయన చూపించిన పరిష్కారాలు ఐడియాలిస్ట్ గా ఉన్నాయి తప్పితే ఆచరణాత్మకంగా లేవు అనడంలో ఎలాంటి సందేహం లేదు..

స్వామినాథన్ విధానాలు ఆచరణాత్మకంగా కావు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం ప్రభుత్వం మీద భారం వేసేలానే ఈయన పరిష్కారాలున్నాయి. శాస్త్రవేత్తగా హిట్ కానీ.. ఆర్థిక వేత్తగా ఫ్లాప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

పంటలకు మద్దతు ధర ఇవ్వడం అనేది ప్రభుత్వం బాధ్యత కాదు.. ప్రభుత్వ రోల్ తక్కువ ఉండాలి. మార్కెట్ నియంత్రించాలన్నది ప్రస్తుత కార్పొరేట్ విధానం. కానీ ఎంఎస్ స్వామినాథన్ పరిష్కార మార్గాలు ఆచరణీయం కాదన్నది మేధావుల అభిప్రాయం..

భారతరత్న స్వామినాధన్ హరిత విప్లవ సారధిగా గౌరవిద్దాం, కానీ ఆర్థికవేత్తగా కాదు’ స్వామినాథన్ సూచనలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.