భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైలు మార్గం. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైళ్ల ద్వారా నిత్యం వేలాది మంది 24 గంటలు ప్రయాణిస్తూ ఉంటారు. సుదూరం ప్రయాణం చేసేవారికి ఏమాత్రం అలసట, కష్టం లేకుండా తక్కువ ఖర్చుతో ఉండాలంటే రైలు ప్రయాణానికి మించినది లేదు. అందువల్ల సామాన్యుల నుంచి ధనిక వర్గాల వరకు లాంగ్ జర్నీ చేయాలనుకునేవారు రైలులోనే వెళ్తుంటారు. దేశ వ్యాప్తంగా వేల కొద్ది రైళ్లు ఉన్నాయి. ఇవన్నీ ఒకటికి మరొకటి మ్యాచ్ కాకుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని చోట్ల ట్రాక్ రిపేర్, మరికొన్ని చోట్ల ఇతర సమస్యల వల్ల రైలు ప్రయాణం ఆలస్యం అవుతుంది. ఇలాంటి సమయంలో ప్రయాణికుడికి ఏదైనా నష్టం జరిగితే రూ.60 వేల వరకు పొందవచ్చు. అదెలాగంటే?
రైలు ప్రయాణం ఎంత సౌకర్యంగా ఉంటుందో అంత లేట్ గా ఉంటుంది. ఒక్కోసారి సమయానికంటే ఎక్కువ గంటలు రైలు ఆలస్యంగా రావొచ్చు. అయితే ఇలాంటి సమయంలో రైలు ఎందుకు లేటవుతుందో కొందరు అధికారులు ప్రయాణికులకు వివరిస్తారు. మరికొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఇలాగే ఒక ప్రయాణికుడు రాజస్తాన్ నుంచి శ్రీనగర్ వెళ్లడానికి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అతనికి కోపం వచ్చింది. దీంతో అతడు ఏం చేశాడంటే?
వాస్తవానికి ఆ ప్రయాణికుడు ఓ బిజినెస్ డీల్ కోసం రైలు టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ సమయానికి రైలు రాలేదు. అంతేకాకుండా సదరురైలు అధికారిని ట్రైన్ ఎందుకు లేటయిందని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. అయితే ట్రైన్ సమయానికి రాకపోవడంతో ఓ వ్యాపార ఒప్పందం విషయంలో అతడికి భారీ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి సుప్రీం కోర్టులో తనకు జరిగిన అన్యాయం గురించి వివరించాడు.
కోర్టు ఆ వ్యక్తి కాంప్లయింట్ పై విచారణ జరిపి తనకు జరిగిన నష్టపరిహారం కింద రైలు వ్యవస్థ నుంచి రూ.60 వేలు పరిహారం ఇప్పించింది. దీనిని భట్టి తెలిసేదేమిటంటే.. రైలు ఆలస్యం అయితే సదరు సిబ్బంది, అధికారులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ముందు సమాచారం ఇవ్వడం ద్వారా ఇతర రవాణా మార్గాలు ఏర్పాటు చేసుకుంటారు. ప్రయాణికులతో నిర్లక్ష్యంగా మాట్లాడకుండా సరైన విధంగానైనా సమాధానం చెప్పాలి. అప్పుడే రైలు వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడుతుంది.