https://oktelugu.com/

స్టాక్ మార్కెట్లో రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేసిన బుడతడు.. చివరకు..?

మనలో అతికొద్ది మందికి మాత్రమే స్టాక్ మార్కెట్లపై పూర్తిస్థాయిలో అవగాహన ఉంటుంది. ఉన్నత విద్య చదివిన చాలామందికి సైతం స్టాక్ మార్కెట్ గురించి సరైన అవగాహన ఉండదు. అయితే 12 సంవత్సరాలకే ఒక బుడతడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడంతో పాటు కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకున్నాడు. తల్లిదండ్రుల సహకారంతో ఏకంగా రూ.16 లక్షలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి 43 శాతం లాభాలు పొందాడు. Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 10, 2021 / 05:56 PM IST
    Follow us on

    మనలో అతికొద్ది మందికి మాత్రమే స్టాక్ మార్కెట్లపై పూర్తిస్థాయిలో అవగాహన ఉంటుంది. ఉన్నత విద్య చదివిన చాలామందికి సైతం స్టాక్ మార్కెట్ గురించి సరైన అవగాహన ఉండదు. అయితే 12 సంవత్సరాలకే ఒక బుడతడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడంతో పాటు కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకున్నాడు. తల్లిదండ్రుల సహకారంతో ఏకంగా రూ.16 లక్షలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి 43 శాతం లాభాలు పొందాడు.

    Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. వారికి లైఫ్ టైమ్ ఫ్యామిలీ పెన్షన్..?

    పూర్తి వివరాల్లోకి వెళితే దక్షిణ కొరియాలో 12 సంవత్సరాల వయస్సు గల క్వాన్ జూన్ అనే బాలుడు షేర్ మార్కెట్ ను ఖచ్చితంగా అంచనా వేయగల సామర్థ్యం ఉన్న బాలుడు. గతేడాది క్వాన్ జూన్ తన తల్లిదండ్రుల సహకారంతో సొంతంగా ట్రేడింగ్ అకౌంట్ ను తీసుకున్నాడు. ఆ తరువాత తల్లిదండ్రులకు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి 16 లక్షల రూపాయలు మూలధనంగా పెట్టి స్టాక్ మార్కెట్ లో అడుగు పెట్టాడు.

    Also Read: లేడీ కస్టమర్ కు షాకిచ్చిన డెలివరీ బాయ్.. ఏం చేశాడంటే..?

    ఏడాది గడిచేసరికి ఊహించని విధంగా 43 శాతం లాభాలను సొంతం చేసుకున్నాడు. వారెన్ బఫెట్ అంతటి వ్యక్తి కావాలనే లక్ష్యంతో క్వాక్ జూన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాడని తెలుస్తోంది. కోకాకోలా, శాంసంగ్, హ్యుండాయ్ షేర్‌లను కొనుగోలు చేసి క్వాన్ జూన్ లాభాలను సొంతం చేసుకున్నాడు. క్వాక్ జూన్ మాత్రమే కాదు దక్షిణ కొరియాలో చాలామంది పిల్లలు స్టాక్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    గతేడాది లాక్ డౌన్ అమలులోకి వచ్చిన సమయంలో పిల్లలు స్టాక్ మార్కెట్ లోకి ఇన్వెస్ట్ చేయడం భారీగా పెరిగిందని తెలుస్తోంది. అయితే నిపుణులు మాత్రం పిల్లలు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.