https://oktelugu.com/

హిట్లు కోసం ప్లాప్ హీరోగారి పాట్లు !

మంచు విష్ణుకి స్టార్ డమ్ రాలేదు, అయినా ఇంకా స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నా, కమర్షియల్ సినిమాలు చేస్తున్నా విష్ణుకు మాత్రం దక్కుతుంది ప్లాప్ ల పరంపరే. స్టార్ కుటుంబాల నుండి వారసులుగా వచ్చిన వారిలో స్టార్ కాకుండా మిగిలిపోయిన వారిలో విష్ణు కూడా ఒక్కడు. మొదటి నుండి వైవిధ్యమైన పాత్రలతో కమర్షియల్ రోల్స్ ను ఎంచుకుంటూ వస్తోన్నా.. ఎందుకో విష్ణుకి ఎప్పుడూ టైమ్ కలిసిరాలేదు. అందుకే ఒకపక్క […]

Written By:
  • admin
  • , Updated On : February 10, 2021 / 05:49 PM IST
    Follow us on


    మంచు విష్ణుకి స్టార్ డమ్ రాలేదు, అయినా ఇంకా స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నా, కమర్షియల్ సినిమాలు చేస్తున్నా విష్ణుకు మాత్రం దక్కుతుంది ప్లాప్ ల పరంపరే. స్టార్ కుటుంబాల నుండి వారసులుగా వచ్చిన వారిలో స్టార్ కాకుండా మిగిలిపోయిన వారిలో విష్ణు కూడా ఒక్కడు. మొదటి నుండి వైవిధ్యమైన పాత్రలతో కమర్షియల్ రోల్స్ ను ఎంచుకుంటూ వస్తోన్నా.. ఎందుకో విష్ణుకి ఎప్పుడూ టైమ్ కలిసిరాలేదు. అందుకే ఒకపక్క హీరోగా చేస్తూనే.. మరోపక్క నిర్మాతగానూ కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు.

    Also Read: ఆసక్తికరమైన బ్యాక్‌ డ్రాప్‌ తో మహేశ్‌ – రాజమౌళి మూవీ !

    పైగా తన సినిమాలకు ఎవరేజ్ మార్కెట్ నే ఉన్నా.. ఎప్పుడూ తక్కువ బడ్జెట్ లోనే సినిమాలు చేయాలనే నియమాలను పెట్టుకోకుండా.. భారీగానే ప్లాన్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకూ తానూ కొన్ని కథలను సరిగ్గా ఎన్నుకోలేదు అని, అందుకే కొన్ని పరాజయాలు మిగిలాయి అని, మంచి కథ అయితేనే సినిమా చేయాలనే పద్ధతిని ఫాలో అయితే, కచ్చితంగా ప్లాప్ లు అయితే రావు అని విష్ణు ఫీల్ అవుతున్నాడట. అందుకే ఇక తన బ్యానర్ లో కేవలం కథలు వినడానికే ఒక టీమ్ ను పెట్టుకుంటున్నారు.

    Also Read: పవన్ కళ్యాణ్ తోనే ‘నిధి’కి బ్రేక్ !

    వారికి హెడ్ గా పరుచూరి గోపాల కృష్ణ ఉండబోతున్నాడు. మరి ఈ టీమ్ వల్ల విష్ణుకు ఎలాంటి కథలు దొరుకుతాయో చూడాలి. ఏది ఏమైనా ఎన్ని సినిమాలు చేసినా కనీసం సెకెండ్ గ్రేడ్ స్టార్ ల వరుసలో కూడా మంచు విష్ణు నిలబడలేకపోయాడు. దానికి తోడు విష్ణుకి సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలం అయిపోయింది. నిజానికి ఢీ తరువాత ఆ రేంజ్ హిట్, విష్ణు కెరీర్ లో లేదు. పైగా సినిమాలను కూడా బాగా తగ్గిస్తూ చేస్తున్నాడు. ఇక చేసిన గత కొన్ని సినిమాలు కూడా ప్లాప్ లు అయ్యాయి. మరి విష్ణు భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్